నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు

నేటి నుంచి ప్రకాశం జిల్లాలో జగన్ సమీక్షలు

Written By news on Monday, November 24, 2014 | 11/24/2014

నేడు వైఎస్ జగన్ రాక
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ఒంగోలులో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పార్టీ వెల్లడించింది.

వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం  హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.

అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం గుంటూరు వెళ్తారని చెప్పారు. పార్టీ నేత అంబటి రాంబాబు నివాసంలో అల్పాహారం స్వీకరిస్తారని, తరువాత నాయకులతో చర్చిస్తారని వివరించారు. ఆ తర్వాత ఒంగోలు వెళ్లి రెండు రోజులపాటు జరిగే పార్టీ కార్యక్రమాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురామ్ చెప్పారు.
Share this article :

0 comments: