దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు

దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు

Written By news on Thursday, November 27, 2014 | 11/27/2014


'దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు'కొడాలి నాని(ఫైల్)వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ: ఏపీ మంత్రులు సంస్కారంలతో మాట్లాడాలని వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, కొలుసు పార్థసారధి సూచించారు. రాజీవ్ గాంధీ భిక్షతోనే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేస్థాయి దేవినేని ఉమకు లేదన్నారు.

కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది దేవినేని ఉమానే అని ఆరోపించారు. కృష్ణానది రిటైనింగ్ గోడ నిర్మించాలని ధర్నా చేసిన దేవినేని ఉమ.. నేడు ఆ టెండర్ ను రద్దు చేశారని తెలిపారు. ఎన్నికల హామీలపై దమ్ముంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ ను కొడాలి నాని, పార్థసారధి గురువారం విడుదల చేశారు.
 
Share this article :

0 comments: