జగన్‌కు అపూర్వ స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు అపూర్వ స్వాగతం

జగన్‌కు అపూర్వ స్వాగతం

Written By news on Tuesday, November 25, 2014 | 11/25/2014

జగన్‌కు అపూర్వ స్వాగతం
గన్నవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో ఉదయం 8.50కి గన్నవరం చేరుకున్నారు. పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, గొట్టిపాటి రవికుమార్, మహమ్మద్ ముస్తాఫా, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, పోతుల రామారావు, పాలర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి,

గుంటూరు జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పుష్పగుచ్ఛాలతో ఘనంగా ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఉప్పాల రాంప్రసాద్, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్‌కుమార్, గుంటూరు జెడ్పీ ఫ్లోర్‌లీడర్ దేవెళ్ల రేవతి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కాసర్నేని గోపాలరావు, ఆరుమాళ్ల సాంబిరెడ్డి, ఎండీ గౌసాని, విజయవాడ 40వ డివిజన్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచులు నీలం ప్రవీణ్‌కుమార్, సాతులూరి శివనాగ రాజకుమారి,  నాయకులు దేవభక్తుని సుబ్బారావు, కాజ రాజ్‌కుమార్, సూరం విజయ కుమార్, కైలే లక్ష్మణకుమార్, లుక్కా ప్రసాద్,   కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నాయకులను పేరుపేరునా పలకరించిన జగన్, వారి గురించి అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: