9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Thursday, June 4, 2015 | 6/04/2015


9 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
* నల్లగొండ జిల్లాలో 17 కుటుంబాలకు పరామర్శ
* 509 కిలోమీటర్ల మేర యాత్ర
* వైఎస్సార్‌సీపీ నేత శివకుమార్
సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. 9న భువనగిరి నియోజకవర్గం బీబీనగర్‌లో యాత్ర ప్రారంభమై.. 12న మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుందని చెప్పారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 509 కి.మీ. మేర యాత్ర సాగుతుందన్నారు.
17 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. మహానేత వైఎస్సార్ మరణం తట్టుకోలేక నల్లగొండ జిల్లాలో 49 మంది చనిపోయారని, అందులో 32 కుటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించారని చెప్పారు. తాజా యాత్ర రోడ్‌మ్యాప్ పూర్తయిందన్నారు. పార్టీ యంత్రాంగంతోపాటు ప్రజలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని కోరారు. త్వరలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా పరామర్శ యాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజ్‌తబా అహ్మద్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: