సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా

సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా

Written By news on Saturday, June 6, 2015 | 6/06/2015


సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్నా
- మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
- అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం
మదనపల్లె:
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ  మదనపల్లెలో శుక్రవారం ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ ఏడాది పాలనను నిరసిస్తూ  వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 300లకు పైగా హామీలు గుప్పించిన చంద్రబాబు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు.

తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ర్ట మంత్రి పీతల సుజాత ఇంట్లో రూ.10 లక్షల డబ్బు దొరికిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికారుల బదిలీల్లో  మంత్రులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజధాని, పట్టిసీమ పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దండుకుని ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనే పని లో ఉన్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం
మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మను వైఎస్సార్ సీపీ నాయకులు దహనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అడ్డుకునేందు కు విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహిం చిన నాయకులు మూడు దిష్టిబొమ్మలను సిద్ధంగా ఉంచుకున్నారు. రెం డింటిని అడ్డుకోగా మరో దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు.
Share this article :

0 comments: