నయా జోష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నయా జోష్

నయా జోష్

Written By news on Saturday, June 6, 2015 | 6/06/2015


నయా జోష్
- జగన్ సమర దీక్ష జయప్రదంతో
- వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం
- చంద్రబాబు సర్కారు వైఫల్యాలపై
- ప్రజల్లో సర్వత్రా చర్చ
సాక్షి, విజయవాడ బ్యూరో : 
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల సమర దీక్ష పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోని పాలకులపై వైఎస్ జగన్ సమరశంఖం పూరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెండు రోజుల దీక్ష విజయవంతం కోసం పది రోజుల నుంచి  పార్టీ కీలక నేతలు చేసిన కృషి ఫలించింది. మంగళగిరి తరలివచ్చిన ప్రజలకే  కాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రజల ముంగిటకు సమరదీక్ష సంకల్పాన్ని తీసుకెళ్లగలిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రాష్ట్రం నలుమూలలా పర్యటించి పార్టీశ్రేణులను సమరదీక్ష కోసం సన్నద్ధం చేయగలిగారు.

ఆయన ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోనే మకాం వేసి రాష్ట్రం అంతటా తిరిగి నియోజకవర్గ సమన్వయకర్తలను, పార్టీ శ్రేణులను కలిసి అందరినీ సమాయత్తం చేశారు. పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ మంగళగిరి వైజంక్షన్ వద్ద స్థలం ఎంపిక నుంచి దీక్ష పూర్తయ్యే వరకు ఏర్పాట్లను చూసి పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)  తమవంతు కృషి చేశారు.   గుంటూరు, కృష్ణా జిల్లాల  నేతలు బాధ్యత తీసుకోవడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టయింది.

వినూత్న తరహాలో ప్రభుత్వ వైఫల్యాలు
ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో వైఎస్సార్ సీపీ చేసిన ప్రయత్నం ఫలప్రదమైంది. టీడీపీ ఇచ్చిన వాటిలో వంద హామీలను ప్రస్తావిస్తూ తొలిరోజున విడుదల చేసిన ప్రజా బ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభించింది. శిశుపాలుడి నూరు తప్పులను శ్రీకృష్ణుడు సహించిన చందాన ఈ ప్రజా బ్యాలెట్‌తో టీడీపీ సర్కార్ వంద హామీలను ప్రజల్లో చర్చకు పెట్టినట్లయిది. రెండో రోజున ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరుతో చంద్రబాబు బూటకపు వాగ్దానాలు, మోసాలను ప్రస్తావిస్తూ ప్రచురించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను జగన్ ఆవిష్కరించారు.

ఇది కూడా చంద్రబాబు ప్రజలను ఎలా దగాచేస్తున్నారో వివరిస్తూ అందరినీ ఆలోచింపజేసింది. వీటితోపాటు చంద్రబాబు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎలా మాట మారుస్తున్నారు అనే వివరాలను రెండో రోజు  స్క్రీన్స్‌పై ప్రదర్శించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తక్కువ సమయంలోనే జగన్ తన ఉపన్యాసంలో వివరించడం అందరినీ ఆకట్టుకుంది. ఏడాది క్రితం టీడీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రాంతంలోనే ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించగా, ఏడాది తరువాత అదే ప్రాంతంలో చరిత్రాత్మక సమర దీక్ష నిర్వహించడంతో వైఎస్సార్‌సీపీ మరింత పట్టు సాధించేందుకు దోహదం చేసింది. 
Share this article :

0 comments: