గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు

గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు

Written By news on Wednesday, June 3, 2015 | 6/03/2015


గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో చేపట్టిన సమరదీక్షకు తగిన భద్రత కల్పించనందుకు ఆ పార్టీ అగ్రనేతలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బైఠాయించారు.

సమరదీక్షకు భద్రత కల్పించాల్సిందిగా కోరేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా..  ఎస్పీ త్రిపాఠి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడగా.. తాను మీటింగ్ లో ఉన్నానని, వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసుల తీరుపట్ల వైఎస్ఆర్ సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్న ఈ దీక్ష పోలీసులు భద్రత కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ఎస్పీ కార్యాలయం వద్ద మెట్లపైనే బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు చర్చలు జరిపారు. వైఎస్ జగన్ సమరదీక్షకు భద్రత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హామీ మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసన విరమించారు.
Share this article :

0 comments: