స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా

స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా

Written By news on Monday, August 31, 2015 | 8/31/2015


స్టేట్ మెంట్ లో ఉంటే రాజీనామా చేస్తా: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో ఉంటే  తాను రాజీనామా చేస్తానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్టేట్ మెంట్ కు, సభలో ఆయన మాట్లాడిన అంశాలకు అసలు పొంతనే లేదన్నారు. తొలిరోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని, మధ్యాహ్నం 12 తర్వాత ప్రశ్నోత్తరాల సమయం జరిగిన సందర్భం ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు.

అసెంబ్లీలో రాజకీయ కుట్రను తాము బహిర్గతం చేశామని.. కౌరవ సభను చూడలేదు గానీ, అంతకన్నా దారుణమైన సభ ఇదని ఆయన అన్నారు. రాజకీయాలు ఇంత దిగజారుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. మొత్తం అర్ధసత్యాలతో అంశాలను వక్రీకరించారని, పద్ధతి ప్రకారం చంద్రబాబు మాత్రమే మాట్లాడిన మాటలు జనంలోకి వెళ్లేలా చూశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈరోజు సభ మొత్తం రాజకీయ కుట్రతోనే నడిచిందని, ప్రజలను గందరగోళపరచడమే ఆయన లక్ష్యమని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రం విడిపోయి ఇన్ని నెలలైనా అసలు తాను ప్రత్యేక హోదాకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం బంద్ జరుగుతుంటే వాళ్లు దాన్ని తొక్కపెట్టడానికి ప్రయత్నించారన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఒకమాట, విజయవాడలో మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి గానీ, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం తగదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: