నేడు కోర్టులో హాజరుకానున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు కోర్టులో హాజరుకానున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత

నేడు కోర్టులో హాజరుకానున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

* ఏడురోజులు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ
* నేడు కోర్టులో హాజరుకానున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత

హైదరాబాబాద్, న్యూస్‌లైన్: కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కస్టడీ ముగిసింది. ఆదివారం ఉదయం 10.35 గంటల నుంచి సాయంత్రం 5.10 వరకూ సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో డీఐజీ హెచ్.వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లు విచారణలో పాల్గొన్నారు. 

ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చిన జగన్.. చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేసిన అనంతరం సీబీఐ ఏర్పాటుచేసిన బులెట్‌ప్రూఫ్ కారు ఎక్కారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయానికి ఆయన్ను తరలించారు. విచారణ ముగిసిన అనంతరం సాయంత్రం మళ్లీ అదే వాహనంలో చంచల్‌గూడ జైలుకు పంపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సీబీఐ అధికారులు ఏడు రోజులపాటు జగన్‌మెహన్‌రెడ్డిని విచారించారు. భోజన విరామ సమయంలో మినహా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా ఈ విచారణ సాగింది. 

సీబీఐ నోటీసులు జారీచేయడంతో గత నెల 25న జగన్ విచారణకు హాజరయ్యారు. వరుసగా మూడు రోజులపాటు దిల్‌కుశ అతిథి గృహంలో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం 27వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు రోజులపాటు విచారణ కొనసాగింది. మళ్లీ హైకోర్టు ఆదేశాలతో శని, ఆదివారం మరో రెండు రోజులపాటు విచారించారు. అరెస్టుకు ముందు తరువాత మొత్తం పదిరోజులపాటు సీబీఐ అధికారులు జగన్‌ను విచారించారు. విచారణకు జగన్ పూర్తిస్థాయిలో సహకరించారు. సోమవారం ఆయనను నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
Share this article :

0 comments: