దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Written By news on Thursday, August 16, 2012 | 8/16/2012

రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. దినేష్ రెడ్డి నియామకాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని గతంలో క్యాట్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. వారంలోగా డీజీపీ స్థాయి అధికారులు వివరాలను యూపీఎస్సీకి పంపాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ నివేదిక అందగానే వారంలోగా కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.

అంతే కాకుండా ప్రభుత్వానికి హైకోర్టు రూ.5వేలు జరిమానా విధించింది. డీజీపీ నియామకం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా పరమైన వివాదాల పరిష్కార న్యాయస్థానం (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం, దినేష్‌డ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: