కాంగ్రెస్, టీడీపీవి కుమ్మక్కురాజకీయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీవి కుమ్మక్కురాజకీయాలు

కాంగ్రెస్, టీడీపీవి కుమ్మక్కురాజకీయాలు

Written By news on Tuesday, October 23, 2012 | 10/23/2012

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై విచారణ జరగకుండా ఆపగలిగారని ఆమె అన్నారు. ఆరోరోజు పాదయాత్రలో భాగంగా షర్మిల కర్ణపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాలక, ప్రతిపక్షాల కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు పార్టీలు కుట్రలతో జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు.

మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని షర్మిల ఆరోపించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రవేవపెట్టిన పథకానికి సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు.

చిత్రావతి : రాజన్న కుటుంబానికి ఉన్నంత పెద్ద మనసు ప్రస్తుత పాలకులకు లేదని షర్మిల అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షానిది అదే పరిస్థితి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారులు అదే ధోరణితో ఉన్నారని షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా చిత్రావతి డ్యామ్‌ పనుల్ని ఆమె మంగళవారం పరిశీలించారు. 

డ్యామ్‌ నిర్మాణం పనులు జరుగుతున్న తీరుపై అధికారులను షర్మిల నిలదీశారు. రైతులంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో డ్యామ్‌ పనుల్ని చూస్తే అర్థమవుతుందని ఆమె అన్నారు. కష్టకాలంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని కష్టాలతో తల్లడిల్లుతున్న జనానికి అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు.

source:sakshi
Share this article :

0 comments: