వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని..

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని..

Written By news on Monday, November 26, 2012 | 11/26/2012

 వైఎస్ఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయటానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్ పెట్టిన సభ ఆపార్టీ ఉనికి కోసమే తప్పా ప్రజల కోసం కాదని ఆయన మండిపడ్డారు. 

సోమవారం పార్టీ కార్యాలయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసినవారి మీద ఆధారపడి లబ్ధి పొందాలని చూడటం హేయమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ వస్తే రెండు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీకి పెరుగుతున్న విస్తృత ఆదరణ చూసి టీఆర్ ఎస్ ఆదరణ కోల్పోతుందనే భయంతోనే అనవసర ప్రేలాపనలు చేస్తుందని జిట్టా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

పులిచింతల సమయంలో మంత్రివర్గంలో టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని, అప్పుడు ఎందుకు నోరు విప్పలేదని జిట్టా సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ వల్లే బీబీనగర్ కు నిమ్స్ వచ్చిందని, ఆయన బతికి ఉండిఉంటే అది ఎప్పుడో ప్రజలకు అందుబాటులోకి వచ్చేందన్నారు. 

సోనియా, రాహుల్, కాంగ్రెస్ పార్టీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ఆయన అన్నారు. వక్ఫ్ భూములపూ కేసీఆర్ పోరాటం ఏమైందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి మూడున్నరేళ్లు అయ్యిందని, మరి ఇప్పుడు తెలంగాణను ఎవరు అడ్డుకుంటున్నారని జిట్టా ప్రశ్నించారు.

source:sakshi
Share this article :

0 comments: