ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా?

ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా?

Written By news on Thursday, October 31, 2013 | 10/31/2013

...ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా?: విజయమ్మ
నేలకొండపల్లి(ఖమ్మం) :
సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా, అడ్డుకుంటారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంది అని వైఎస్ విజయమ్మ స్సష్టం చేశారు. 
 
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటిస్తున్న విజయమ్మను పోలీసులే అడ్డుకోవడాన్ని విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని తాము కోరుకుంటున్నాం అని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారన్నారు. కొంత మంది నాయకులు, పార్టీలు వ్యక్తిగత స్వేచ్చను కాలరాస్తున్నారు. ప్రజలను కలుసుకోవడం తప్పా అని ప్రశ్నిస్తున్నాను. 
 
 
తుఫాన్ కారణంగా రైతులు ఇబ్బందులకు గురైతే.. మంత్రులు కాని, సీఎం, సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ లు పరామర్శించారా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే పాకిస్థానా, బంగ్లాదేశా అని ప్రశ్నించారు. ప్రజలను పరామర్శించడం కూడా తప్పేనా అని అన్నారు. ప్రజా స్వేచ్చను ప్రభుత్వం కాలరాస్తోంది అని అన్నారు. అడ్డుకునే వారిని అరెస్ట్ చేయాలి కాని... రైతులను పరామర్శిస్తే అరెస్ట్ చేస్తారా అని అన్నారు. అసలు ప్రజాస్వామ్యా దేశంలో ఉన్నామా అని నిలదీశారు. 
 
త్వరలోనే వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. మేము మళ్లీ వస్తాం అని విజయమ్మ చెప్పారు. తుఫాన్ తాకిడికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ విజయమ్మను ఖమ్మం పైనంపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 
Share this article :

0 comments: