బిల్లు గడువు పొడిగించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లు గడువు పొడిగించండి

బిల్లు గడువు పొడిగించండి

Written By news on Thursday, January 30, 2014 | 1/30/2014

బిల్లు గడువు పొడిగించండివీడియోకి క్లిక్ చేయండి
  •  రాష్ట్రపతికి వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత విజయమ్మ లేఖ
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013పై అభిప్రాయాలు చెప్పేందుకు గడువు మరింత పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. సభ్యులందరి అభిప్రాయాలు వెల్లడించేందుకు ఫిబ్రవరి 28వరకు గడువు పొడిగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం లేఖ రాశారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్లో లేఖను విడుదల చేశారు. ‘సమైక్యాంధ్ర ప్రదేశ్‌కే కట్టుబడి ఉన్న మా పార్టీ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలని, అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని కోరుతూ రూల్ నంబర్ 77, 78ల కింద డిసెంబర్ 12న స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే స్పీకర్ సభలో బిల్లుపై చర్చ ప్రారంభించారు. మా తీర్మానం తర్వాత చర్చ జరపాలని కోరినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మా పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు సభ్యులు చర్చలో భాగస్వాములు అయి బిల్లును, విభజనను వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపారు. మొత్తంగా 279 మంది ఎమ్మెల్యేలలో 85 మంది మాత్రమే మాట్లాడారు. పై పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 28 వరకు గడువును పొడగించండి’ అని విజయమ్మ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు పదవులు వీడి ఉంటే విభజన ప్రక్రియ ఇంత  దూరం వచ్చేదే కాదన్నారు.
 
'తప్పుడు నిర్ణయం తీసుకుంటే చరిత్ర క్షమించదు'
రాష్ట్ర విభజన బిల్లుపై గురువారం రోజున అసెంబ్లీలో ఓటింగ్ తీసుకోవాలని విజయమ్మ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పోలీసులు ధర్నాను భగ్నం చేసి, పార్టీ కార్యాలయానికి తరలించిన అనంతరం లోటస్ పాండ్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న ధర్నాను భగ్నం చేయడంపై విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఇప్పటికిలా మూడుసార్లు అరెస్టు చేసి తెచ్చారన్నారు. విభజన ప్రక్రియకు కేంద్రం పూనుకున్నప్పటి నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అనేక విధాల పోరాటం చేస్తోందన్నారు. బుధవారం అసెంబ్లీలో తాము ధర్నాకు దిగింది కూడా సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలనేనన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే చరిత్ర క్షమించదన్నారు. అందుకే గురువారం సభలో తీర్మానం పెట్టి రాష్ట్రపతికి పంపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై బహుశా స్పీకర్ గురువారం స్పందించవచ్చన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. స్పీకర్ నుంచి స్పష్టత రానందుకే ధర్నాకు పూనుకున్నామని ఆమె అన్నారు.
Share this article :

0 comments: