మూడవరోజూ అదే ఉత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడవరోజూ అదే ఉత్సాహం

మూడవరోజూ అదే ఉత్సాహం

Written By news on Thursday, January 23, 2014 | 1/23/2014


జనం.. జనం
  •    మూడవరోజూ అదే ఉత్సాహం
  •      జననేతను చూసేందుకు పరుగులు తీసిన జనం
  •      జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పు, సమైక్యయాత్ర
  •      జగన్ బొమ్మలతో టీషర్టులు, బెలూన్లతో ప్రచారం
 
సాక్షి, చిత్తూరు: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన సమైక్య శంఖారావం యాత్రలో జననేతకు అఖండ స్వాగతం లభించింది. మూడవరోజు కొత్తపల్లిమిట్టలో జరిగిన నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్రలో ఆయన పాల్గొన్నారు. దారి పొడవునా తమ అభిమాన నాయకుడికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ జీడీ నెల్లూరు నాయకులు ఆహ్వానం పలికారు. ఇందులో సమైక్య సింహానికి స్వాగతం అని రాయడం చూపరులను ఆకర్షించింది. కొత్తపల్లిమిట్టలో జరిగిన బహిరంగసభా వేదిక వద్ద వై.ఎస్.జగన్ ఫొటోలతో గాలిలోకి ఎగురవేసిన బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
ఇలా పర్యటన

జననేత వై.ఎస్.జగన్ బుధవారం నెలవాయి గ్రామం నుంచి బయల్దేరి క్షీరసముద్రం చేరుకుని రోడ్‌షోలో  పాల్గొన్నారు. ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన నాయకుడిని ఆహ్వానించారు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రోడ్డు పక్కన తన కోసం వేచి ఉన్న పులివెందుల వైఎస్సార్ సీపీ నాయకులను  జగన్‌మోహన్‌రెడ్డి పలకరించా రు. క్షీరసముద్రం ఎస్సీ కాలనీలో వాహనం దిగి ప్రతి ఒక్క మహిళనూ పలకరిస్తూ, ఆశీర్వదిస్తూ సాగారు.

చిన్నారులను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని దీవించారు. తమ గ్రామానికి విచ్చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు మ హిళలు కాన్వాయ్ వద్దకు పరుగులు తీశారు. నాయుడుపల్లె వద్ద జగన్ ఫొటో ఉన్న టీషర్టులను ధరించిన యువకులు ట్రాక్టర్లలో ఎదురొచ్చి స్వాగతించారు. ఎస్‌ఆర్ పురం, ఎస్‌ఆర్ పురం క్రాస్‌లో రెండువేల మందికి పైగా గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు చంటి బిడ్డలను ఎత్తుకుని ఎండలో ప్రియతమ నేత కోసం రోడ్డుకు ఇరువైపులా వేచి ఉండడం కని పించింది. ఇక్కడ  జననేత వాహనం దిగి ప్రతి ఒక్కరినీ పలకరించారు.
 
చిన్నారులకు నామకరణం
 
ఎస్‌ఆర్ పురం క్రాస్ నుంచి పుల్లూరు క్రాస్ చేరుకుని జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ గ్రా మంలో మహిళలు తమ నాయకుడికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ ఊర్లో ఒక మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను జగన్ చేతుల్లో ఉంచి నామకరణం చేయాలని కోరారు. ఆయన వారిద్దరికి విజ యమ్మ అని నామకరణం చేశారు. శూలగిల్లులో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. కార్యకర్తలు, గ్రామస్తులను పలకరించారు. జగన్ బొమ్మలతో రూ పొందించిన టీషర్టులు ధరించిన వైఎస్సార్ సీపీ కా ర్యకర్తలు, యువకులు కాన్వాయ్ వెంట సాగారు. శూలగిల్లులో చెరుకు రైతులతో జననేత మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలు ఓపిగ్గా విన్నారు. అక్కడ నుంచి తెల్లగుండపల్లె చేరుకుని ఓదార్పులో పాల్గొన్నారు.

మహానేత వైఎస్ మరణం తట్టుకోలేక మృతి చెందిన పోతగంటి నరసయ్య కుటుంబాన్ని ఓదార్చారు. వారికి అండగా ఉంటానని, అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచి ఎన్‌ఆర్.పురం, ఎన్.ఆర్‌పురం ఎస్సీ కాలనీల మీ దు గా  రోడ్‌షో నిర్వహించారు. దళితులను, గిరిజనులను పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ కదిలారు. ఆగిన ప్రతిచోటా యువకులు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జననేత అన్నాగారి ఊరు చేరుకుని అక్కడ మహిళలను ఆశీర్వదించారు. ఒక విద్యార్థినికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. రోడ్‌షో కొనసాగిస్తూ వడ్డికండ్రిగ, వేణుగోపాలపురం చేరుకున్నారు.

వేణుగోపాలపురంలో పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను జగన్ ఆవిష్కరించారు. ఎస్‌జె కాలనీ వద్ద షికారీలను పలకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఎం.పురం, ఆదిఆంధ్రవాడ వద్ద జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారిలో చిన్నపాప అనే గిరిజన మహిళను జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు. చిన్నబాపనపల్లె, శెట్వనత్తంలో   వాద్యాలతో నాట్యం చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడ్ని స్వాగతించారు. అక్కడ నుంచి నేరుగా కొత్తపల్లిమిట్ట చేరుకుని సమైక్య శంఖారావం సభలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

మూడవరోజు పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు సమన్వయకర్త కె.నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, రాజం పేట నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డప్పరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: