పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవా

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవా

Written By news on Sunday, January 19, 2014 | 1/19/2014

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలను వైఎస్సార్ సీపీ భగ్నం చేసింది. జిల్లావ్యాప్తంగా పలు పంచాయతీల్లో శనివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను ఎదురొడ్డి పోరాడారు. ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలంలోని నాలుగు పంచాయతీల ఎన్నికల్లో ప్రధానంగా రెండు మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

 అల్లూరు రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉన్న కొత్తపట్నం, అల్లూరు, గమళ్లపాలెం, కే పల్లెపాలెం పంచాయతీలకు కుట్రలు భగ్నం  ఎన్నికలు నిర్వహించారు. వీటిలో మేజర్ పంచాయతీలైన కొత్తపట్నం, అల్లూరులను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది.

 3 కొత్తపట్నం మేజర్ పంచాయతీలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి మూగ ధనమ్మ 254 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. పంచాయతీలో 5,245 ఓట్లు ఉండగా 4,527 ఓట్లు పోలయ్యాయి. ధనమ్మకు 1940 ఓట్లు రాగా, కాంగ్రెస్, టీడీపీ కలిసి బలపరిచిన అభ్యర్థి పులి ఆదిలక్ష్మికి 1686 ఓట్లు వచ్చాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. సీపీఐ కూడా ఇక్కడ అభ్యర్థిని బరిలో దింపింది. ఆ అభ్యర్థికి 710 ఓట్లు వచ్చాయి. 191 ఓట్లు చెల్లలేదు.

 3 మరో మేజర్ పంచాయతీ అల్లూరులో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి మొక్కా మోహనరావుకు 2012 ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్‌లు కలగలిసి నిలబెట్టిన అభ్యర్థి బంకా కోటేశ్వరరావుకు 1922 ఓట్లు వచ్చాయి. 90 ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.  186 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

 3 కే పల్లెపాలెంలో టీడీపీ, కాంగ్రెస్‌లు కలగలిసి బరిలో దింపిన నాయుడు ప్రభుప్రకాష్ 236 ఓట్ల ఆధిక్యతతో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి విశ్వనాథపల్లి ఆనందరావుపై విజయం సాధించారు. ప్రభుప్రకాష్‌కు 1346 ఓట్లు రాగా, ఆనందరావుకు 1110 ఓట్లు వచ్చాయి. 74 ఓట్లు చెల్లలేదు. ఈ గ్రామంలో గతంలో టీడీపీకి మంచి పట్టుండేది. ప్రతి ఎన్నికల్లో 800 నుంచి 900 వరకు మెజారిటీ వచ్చేది. అలాంటిది వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో తన బలాన్ని మూడింతలు పెంచుకుంది. ఈ సారి కాంగ్రెస్, టీడీపీ కలగలసి అభ్యర్థిని నిలబెట్టినా కేవలం 236 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది.

  3 గమళ్లపాలెంలో వైఎస్సార్ సీపీ బలమైన పోటీనిచ్చింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో కాంగ్రెస్, టీడీపీ బలపరిచిన అభ్యర్థి గమ్మళంపాటి నరసమ్మ కేవలం 25 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. నరసమ్మకు 852 ఓట్లు రాగా, వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి దోనెంపూడి నాగేశ్వరికి 827 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 36 ఓట్లు చెల్లలేదు. 
Share this article :

0 comments: