
భీమవరం: 'పోలవరం ప్రాజెక్ట్ కోసం దశాబ్దకాలం పాటు పోరాడిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే వైఎస్ ఆర్ పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 4వేల కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ శుక్రవారం ఉభయగోదారి జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై ఆయన మాట్లాడారు.
పోలవరం కోసం తానే స్వయంగా 100కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని ఆయన చెప్పారు. పోలవరానికి ఎవరు అడ్డుతగిలినా క్షమించమన్నారు. దీనిపై గట్టిగా పోరాటం చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అంతకముందు రాజమండ్రిలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కావాలంటే మంగళగిరిలో 2,3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడే రాజధాని నిర్మించుకోవచ్చన్నారు. మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవటం అన్యాయమన్నారు.
0 comments:
Post a Comment