వైఎస్సార్‌సీపీఎల్పీ నేతగా పాయంను ప్రకటించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీఎల్పీ నేతగా పాయంను ప్రకటించాలి

వైఎస్సార్‌సీపీఎల్పీ నేతగా పాయంను ప్రకటించాలి

Written By news on Saturday, March 7, 2015 | 3/07/2015

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పాయం వెంకటేశ్వర్లును వెంటనే ప్రకటించాలని అసెంబ్లీ కార్యద ర్శి రాజా సదారాంకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. పార్టీ ప్రధానకార్యదర్శి కె.శివకుమార్, పార్టీనేతలు నాయుడు ప్రకాశ్, బీష్వ రవీందర్ ఈ లేఖను సదారాంకు అందజేశారు. అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన సమావేశంలో దీని అమలుపై చర్యలు తీసుకుంటామని కార్యదర్శి తెలిపినట్లు శివకుమార్ మీడియాకు చెప్పారు.
Share this article :

0 comments: