ఆ భూమిని రైతులకు తిరిగి ఇప్పిస్తాo - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ భూమిని రైతులకు తిరిగి ఇప్పిస్తాo

ఆ భూమిని రైతులకు తిరిగి ఇప్పిస్తాo

Written By news on Tuesday, March 3, 2015 | 3/03/2015


ఆ భూమిని రైతులకు తిరిగి ఇప్పిస్తా: వైఎస్ జగన్
ఉండవల్లి : అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న ప్రతి ఒక్క ఎకరా భూమిని తాను అధికారంలోకి రాగానే తిరిగి ఆయా రైతులకు ఇప్పిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంతంలో ఆయన పర్యటించి, రైతులు.. రైతు కూలీలు.. రైతు మహిళలతో మాట్లాడారు.

''ఇక్కడకు సమీపంలోనే వినుకొండలో 18వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ తీసుకుంటామంటే ఏ రైతూ అభ్యంతరం చెప్పరు. అలాంటి చోటును వదిలేసి, మూడు పంటలు పండే బంగారం లాంటి భూమిని బలవంతంగా లాక్కుని సింగపూర్ సిటీ కడతాననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నా. రైతులు, రైతు కూలీలు, అందరి దగ్గర్నుంచి విషయం తెలుసుకున్నాం. అందరి బాధలు విన్నాం. భూములు తీసుకుంటే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదని చంద్రబాబుకు తెలియడంలేదు. మళ్లీ మళ్లీ ఒక్క విషయం చెబుతున్నా. చంద్రబాబు నాయుడు బలవంతంగా ఏ ఒక్కరి నుంచి భూములు తీసుకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ ప్రతి భూమీ తిరిగి ఇస్తానని చెబుతున్నా. అందరం కలిసికట్టుగా చంద్రబాబు మెడలు వంచి అయినా సరే, పోరాటం చేద్దాం. మనసులో కొండంత బాధ ఉన్నా.. చిరునవ్వుతో ఇక్కడికొచ్చి పలకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగం ముగించారు.
Share this article :

0 comments: