ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం

ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం

Written By news on Friday, March 6, 2015 | 3/06/2015


'ప్రాజెక్టులకోసం అవిశ్రాంత పోరాటం'
కడప:  ఉద్యమనేతలు, సహచర ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష సభ్యుల సూచన మేరకు దీక్షను విరమిస్తున్నానని, మెట్ట ప్రాంతం ఉన్నతి కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 'గాలేరు-నగరి'కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా ఆయన వీరపునాయుని పల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్ష నేతల సూచనతో గురువారం ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమకు జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ జీవనాధారమని, వాటి కోసం అన్ని పక్షాలతో కలిసి అవిశ్రాంత పోరాటం చేస్తామన్నారు. కాగా ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వ స్పందన లేకపోవడంపై వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు గురువారం జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు  చేపట్టాయి.
Share this article :

0 comments: