
అనంతరం భీమవరం పయనం
రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాజమండ్రి రానున్నారు. ఆయన ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని, మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల కుమారుడు, పార్టీ కార్యదర్శి రాజా వివాహ వేడుకకు హాజరవుతారు.
జక్కంపూడి ఇంటికి వెళ్లి నూతనవరుడైన రాజాను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేస్తారు. అనంతరం జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయలుదేరి వెళతారు.
0 comments:
Post a Comment