వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది

వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది

Written By news on Tuesday, March 3, 2015 | 3/03/2015


'వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రతో చంద్రబాబు సర్కార్ మైండ్ బ్లాంక్ అయిందని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ్మినేని సీతారాం  విలేకర్లతో మాట్లాడుతూ... తణుకులో వైఎస్ జగన్ చేపట్టిన దీక్షతో ప్రభుత్వం గుండెల్లో దడ మొదలైందని ఆరోపించారు. దీంతో చంద్రబాబు చాలా అసహనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం కాదు... కానీ ప్రభుత్వం అనుసరించే పద్దతే ఆక్షేపణీయమని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. రాజధాని కోసం తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారని తమ్మినేని సీతారాం వెల్లడించారు.
Share this article :

0 comments: