తెలంగాణలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ

తెలంగాణలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీ

Written By news on Tuesday, March 3, 2015 | 3/03/2015

ఆదిలాబాద్ రిమ్స్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగబోతోందని  పార్టీ జిల్లా పరిశీలకుడు భగవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిశీలకుడు భగవంత్‌రెడ్డి, సహాయ పరిశీలకుడు విలియం ములిగెల, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్మ రవీంధర్‌రెడ్డి హాజరయ్యూరు.

ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి పూల వేసి నివాళులర్పించారు. జోహర్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం భగవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పేర్కొన్నారు. చివరి వరకు ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లిన వారే నిజమైన కార్యకర్తలని తెలిపారు. ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్నారని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ప్రారంభించి సుమారు కోటి ఎకరాలకు నీరందించారన్నారు.

వైఎస్ పాలనలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఆయన మరణానంతరం వాటి నిర్మాణం కుంటుపడిపోయిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్ పథకాలకే మెరుగులు దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు రూ.3 లక్షలతో ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించినా.. ఇంత వరకు దానికి రూపకల్పన చేయలేదన్నారు. దళితులకు మూడెకరాలు వ్యవసాయ భూమి పంపిణీ చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆసరా, ఆహార భద్రతా కార్డుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వైఎస్సార్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, తెలంగాణ ప్రాంతంలోనే ఆయనకు ఎక్కువ అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. వైస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారన్నారు. సమావేశం అనంతరం నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ను సన్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగోరావు, నాయకులు విజయ్‌కుమార్, పద్మ, వసీంఖాద్రీ, మొయినొద్దీన్, సిర్పూర్(యు) ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
 
బడుగు, బలహీన వర్గాల పార్టీ..
బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీ ఆవిర్భవించింది. వైఎస్ పథకాలతో గౌరవంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక ఆశయం, ఒక లక్ష్యంతో పార్టీ అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్లాలి. త్వరలో అన్ని కమిటీలను వేసుకుని జిల్లా వ్యాప్తంగా క్యాడర్‌ను బలోపేతం చేస్తాం. పార్టీకి పునర్‌వైభవాన్ని తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉండే వారికి గుర్తింపు లభిస్తుంది. పార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ను మొదటి స్థానంలో నిలుపుతాం. ప్రతి గ్రామంలో, మండలంలో పార్టీ జెండా ఎగురాలి. వైఎస్ సంక్షేమ పథకాలే పార్టీకి అండగా ఉంటాయి.
- బి.అనిల్‌కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
 
ప్రజలను టీఆర్‌ఎస్ మోసం చేస్తోంది..
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ కు టుంబ సభ్యులు, లీడర్లకే పదవులు వస్తున్నాయి. కేసీఆర్ మా టలకు మాత్రమే పరిమితమయ్యారు. గ్రామాల్లోకి వెళ్లి వైఎ స్సార్ పథకాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ సీపీకే ఉంది. ము స్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక్క రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. పార్టీ అన్ని విధాలా తిరుగులేని శక్తిగా ఎదిగి 2019 ఎన్నికలకు వెళ్తుంది.
 - భీష్మ రవీందర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
 
వైఎస్ పాలన స్వర్ణయుగం..
రాష్ట్రంలో వైఎస్సార్ పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. ఆయన పాలనలో రాష్ట్రంలో ప్రతి కు టుంబం ఏదో విధంగా లబ్ధి పొందింది. ఆయన పథకాలు ప్రజల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులకు రుణాలు అందక, పంటలకు నీరు లేక నష్టపోతున్నారు. వైఎస్ మరణానంతరం జలయజ్ఞం కుంటు పడిపోయింది. సర్వే పేరుతో కేసీఆర్ లబ్ధిదారులను పథకాలకు దూరం చేశారు. త్వరలో పార్టీ గ్రామ, మండల కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తాం.        - విలియం ములిగెల, వైఎస్సార్ సీపీ జిల్లా సహాయ పరిశీలకుడు
Share this article :

0 comments: