జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి

జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి

Written By news on Friday, March 6, 2015 | 3/06/2015


'జనసేన పార్టీని ధనసేనగా మార్చుకోండి'
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో మాట్లాడిన మాటలకు... మీడియా సమావేశానికి పొంతన లేదని ఆరోపించారు.
రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా టీడీపీ మంత్రులను తిట్టిన పవన్... హైదరాబాద్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ మీద విమర్శలు చేస్తున్నారని... ఈ విమర్శలు చేయడానికి ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయారని అమర్నాధ్... పవన్ ను సూటిగా ప్రశ్నించారు.
జనసేన పార్టీని ధనసేన అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అమర్నాధ్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు వేశారో చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెరవెనక చంద్రబాబు డైలాగ్స్ రాస్తుంటే తెర ముందు పవన్ డైలాగ్స్ చెబుతున్నారని విమర్శించారు.
Share this article :

0 comments: