21న షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21న షర్మిల పరామర్శ యాత్ర

21న షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Monday, September 14, 2015 | 9/14/2015

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరికలు
ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ
జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి

 
రాజుపేట(మంగపేట) : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల 3వ విడత పరామర్శ యాత్ర ఈనెల 21న మండలంలోని బండారుగూడెం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహెందర్ రెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సమీక్షించారు. మండలంలోని రమణక్కపేటకు చెందిన ఎక్స్ ఎంపీటీసీ సభ్యుడు బట్ట చందర్రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన అనుముల రాఘవరెడ్డి, మల్‌రెడ్డి సుధాకర్‌రెడ్డి, కోడెం రవీందర్, గాదె నర్సింహారావు, మంచర్ల సూర్యం, బట్ట బాబూరావు, పోలె బోయిన రవరాజు, కనుకుంట్ల నాగయ్య వైఎస్సార్‌సీపీలో చేరారు. మహెందర్‌రెడ్డి వారిని పార్టీ కండువాతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట జిల్లా జాయింట్ జెక్రటరీ ఎండీ కైసర్‌పాషా, ఏటూరునాగారం గ్రామకమిటీ అధ్యక్షుడు యరకట్ల సమ్మయ్య, జిల్లా నాయకులు నరెందర్‌రెడ్డి, సప్పిడి రంజిత్, వీరారెడ్డి ఉన్నారు.

 ఏటూరునాగారం : మండల కేంద్రానికి 21న షర్మిల రానున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆదివారం రూట్ మ్యాప్ పరిశీలించారు. మండల కేంద్రంలో దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వల్స చిన్నక్క ఇంటిని ఆయన సందర్శించారు. ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్షించారు. ఆయన వెంట నాయకులు సోమ నరేందర్, సప్పిడి రంజిత్, ఖైసర్‌పాషా, విజయభాస్కర్‌రెడ్డి, గద్దెల సాలయ్య, సాబీర్, ఎర్రకట్ల సమ్మయ్య, గౌస్‌పాషా ఉన్నారు.

 వైఎస్సార్ విగ్రహ పరిశీలన
 వెంకటాపురం : మండల కేంద్రంలోని తాళ్లపాడ్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈనెల 22న మండలంలో మృతి చెందిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. ఈ సందర్భంగా షర్మిల వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి, సప్పిడి రంజిత్, వీరారెడ్డి వెంకటాపురం మండల అధ్యక్షుడు మెట్టు సురేష్ ఉన్నారు.
Share this article :

0 comments: