రైతు ఆత్మహత్యలు సర్కారీ హత్యలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు ఆత్మహత్యలు సర్కారీ హత్యలే

రైతు ఆత్మహత్యలు సర్కారీ హత్యలే

Written By news on Saturday, September 19, 2015 | 9/19/2015

‘‘అన్నదాతల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందుంది. రైతాంగం ఆశలపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రుణాలు అందక, గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు పిట్టల్లా రాలిపోతున్నా.. ఈ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. 15 నెలల కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు 1,100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేవలం 120 కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా అందించడం దారుణమన్నారు.

రైతు ఆత్మహత్యలు ఆపాలని, కరువు మండలాలు ప్రకటించాలని, రైతు రుణాలన్నీ ఏకమొత్తంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బంగారుమయమవుతాయని కలలుగన్న రైతన్నల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘ఎన్నికలకు ముందు, తర్వాత రైతు ఆత్మహత్యలను సర్కారీ హత్యలుగానే పరిగణిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పడు 1,100 రైతుల మరణానికి బాధ్యత వహిస్తారా..? రాష్ట్రంలో జరుగుతున్న ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని బీరాలు పలికారు. రుణమాఫీ దేవుడెరుగు.. కొత్తగా ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వడ ం లేదు. రైతు పక్షపాతిగా వ్యవహరించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1.50 లక్షల పరిహారాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా సకాలంలో అందించకపోవడం దారుణం’’ అని పొంగులేటి అన్నారు. పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
 
రూ.5 వేల కరువు పింఛన్ ఇవ్వాలి
రైతుల వెన్నంటి నిలిచేది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని పొంగులేటి చెప్పారు. త్వరలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని అభ్యర్థించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పారు. రైతులకు నెలకు రూ.5 వేల చొప్పున కరువు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, సయ్యద్ మతీన్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆడెం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ధనలక్ష్మి, ప్రభుకుమార్, అమృతాసాగర్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముజ్తాబా అహ్మద్, సంయుక్త కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వరలక్ష్మి, సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షుడు ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు.
 
జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
రైతు సమస్యలపై వైఎస్సార్‌సీపీ అన్ని జిల్లాల్లో భారీగా ఆందోళనలు చేపట్టింది. ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నేతలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్‌లో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, వరంగల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతి కుమార్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ సేవాదళ్ రాష్ట ప్రధాన కార్యదర్శి నీలం రమేశ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంగయ్య, కరీంనగర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆదిలాబాద్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగన్న, ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మట్టా దయానంద్, నల్లగొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్నేని వెంకట రత్నంబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: