నారాయణ కళాశాల విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణ జరపాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నారాయణ కళాశాల విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణ జరపాలి

నారాయణ కళాశాల విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణ జరపాలి

Written By news on Sunday, September 13, 2015 | 9/13/2015


నారాయణ కళాశాల విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణ జరపాలి
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్

 పులివెందుల : గతనెల 17వ తేదీ కడప నారాయణ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మనీషారెడ్డి, నందినిల మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మనీషారెడ్డి తల్లిదండ్రులు బాలకృష్ణ, సరోజలతోపాటు ఇతర బంధువులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీతో మాట్లాడుతూ పోలీసులు ఇంతవరకు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని మొరపెట్టుకున్నారు. పోలీసులు కళాశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాశాల వద్దకు వెళ్లి కళాశాల డీజీఎం రామ్మోహన్‌రెడ్డిని న్యాయం చేయమని అడిగితే పోలీస్‌స్టేషన్‌లో పెట్టి కొట్టిస్తానని తమను బెదిరిస్తున్నారన్నారు. పోస్టుమార్టం నివేదిక అడిగితే డాక్టర్లు, తహశీల్దార్, పోలీసులు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటారే తప్ప తమకు ఇంతవరకు పోస్టుమార్టం నివేదిక కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై స్పందించిన ఎంపీ ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నారాయణ కళాశాలల్లో ఇంతమంది విద్యార్థులు చనిపోతుంటే చంద్రబాబు మాత్రం తన కేబినెట్‌లోని మంత్రిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు.

విద్యార్థులు చనిపోయి ఇప్పటికి 25రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు పోస్టుమార్టం నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థుల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని న్యాయ పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కాగా, శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: