రైతులు గర్వించే రోజొస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులు గర్వించే రోజొస్తుంది

రైతులు గర్వించే రోజొస్తుంది

Written By news on Sunday, October 21, 2012 | 10/21/2012

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘జగన్ బాబు పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట ఇచ్చాడు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతానన్నాడు. పిల్లలను బడికి పంపితే ఒక్కో పిల్లాడికి రూ. 500 చొప్పున తల్లి ఖాతాలో ప్రతి నెలా జమ చేస్తానన్నాడు. పిల్లలను పూర్తిగా ఉచితంగా చదివిస్తానన్నాడు. అవ్వాతాతలు మూడు పూటలా భోజనం చేసేందుకు వీలుగా నెలకు రూ.700 పెన్షన్ ఇస్తానన్నాడు. వికలాంగులకు పెన్షన్ రూ. 1,000 చేస్తానన్నాడు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద ప్రత్యేకంగా రూ. 3 వేల కోట్ల నిధి పెడతానన్నాడు. రైతులు ఇది మా ప్రభుత్వం అని ధైర్యంగా కాలర్ ఎగురవేసుకునే పరిస్థితి తెస్తానన్నాడు. ఇది జగన్ బాబు మాట..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా శనివారం పులివెందుల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘టీడీపీ హయాంలో కరువు కాటకాలు, కరెంటు బిల్లులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో వారిని ఓదార్చేందుకు రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం చేపట్టారు. 

ఈరోజు టీడీపీ హయాం కంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మరో ప్రజాప్రస్థానం’ చేపట్టాలని జగన్‌బాబు జైల్లోనే రూట్‌మ్యాప్ తయారుచేసుకున్నాడు. గత నెల 28న, ఈ నెల 5న బెయిల్ వస్తుందనుకున్నాం. కానీ రాలేదు. అయినా ప్రజాసమస్యలపై నినదించాలని, వారికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్‌బాబు నాతో చెప్పారు. 8 కోట్ల మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నాడు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేందుకు ఎవరో ఒకరు ఉండాలని చెప్పాడు. మోకాళ్ల నొప్పులతో ఉన్న నేను నడవలేని పరిస్థితి. ప్రజల కోసం జగన్ పడుతున్న ఆవేదన చూసి షర్మిల తాను నడుస్తానంది. జగన్ రాగానే ఈ పాదయాత్ర తానే చేస్తాడు..’ అని విజయమ్మ స్పష్టంచేశారు.

ప్రభుత్వం స్పందించలేదు..

‘జగన్ ఫీజుల గురించి, రైతుల గురించి అనేక దీక్షలు, ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదు. కేసులు పెట్టిన తరువాత 10 నెలలు కూడా ప్రజల మధ్యే ఉన్నారు. కుటుంబం వైపు కూడా చూడలేదు. సరిగ్గా ఉప ఎన్నికల ముందు విచారణ పేరుతో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇప్పటికి 147 రోజులైంది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కథ నడిపిస్తున్నాయి. ఈ కుమ్మక్కు రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబువి దొంగమాటలు. ఆయనకు కూడా మీరు సమాధానం చెప్పాలి. జగన్ త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పమన్నాడు. అంద రూ ధైర్యంగా ఉండమని తన మాటగా చెప్పమన్నాడు. మళ్లీ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం వస్తుంది..’ అని విజయమ్మ ఉద్ఘాటించారు.
Share this article :

0 comments: