ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ పక్షమే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ పక్షమే..

ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ పక్షమే..

Written By news on Tuesday, August 6, 2013 | 8/06/2013

ఖమ్మం అర్బన్, న్యూస్‌లై న్:  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులపై ఆధారపడి లేదని, కొందరు వ్యక్తిగత స్వార్థంతో పార్టీని వీడినా ప్రజలు, కార్యకర్తలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షానే ఉన్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీజీసీ సభ్యులు చందా లింగయ్య పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అన్ని రాజకీయ పార్టీల లాగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కీలక భూమిక పోషిస్తూ  జగన్‌మోహన్‌రెడ్డి  నాయకత్వంలో పనిచే స్తుందన్నారు.
 
  మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... తెలంగాణ ఏర్పాటుపై  ప్రకటన వెలువడ్డాకా  వివిధ రాజకీయ పార్టీల నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని  టార్గెట్ చేశారని, తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ ఆడ్రస్సు ఉండదని, ఆ పార్టీ ఆంధ్రాకే పరిమితమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను, ఇటీవల పార్టీమద్దతులో గెలుపొందిన సర్పంచ్‌లను కలిసి తమపార్టీలోకి రమ్మంటూ తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 206 సర్పంచ్ స్థానాలను గెలిపించుకొని... వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమబాటకు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.   
 
 ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు కావటం సంతోషించదగ్గ విషయమని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టలే దు, రాష్ట్రం ఏర్పడలేదు కానీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థం కోసం రాజకీయాలను ప్రయోగిస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనే కాక, దేశ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించ బోతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి క ట్టుబడి ఉన్నారని, వాటిని అమలు చేయడం రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్‌ఆర్‌సీపీతోనే సాధ్యమన్నారు. కొందరు స్వలాభం కోసం రాజీనామాలు చేస్తున్నారని , నిన్నటి వరకు పార్టీలో ఉండి పార్టీని పొగిడిన నాయకులు నేడు పార్టీని, నాయకత్వాన్ని  విమర్శించటం సరికాదన్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ  మొదటి ప్లీనరీలో తెలంగాణ ఏర్పాటు పై ఏ నిర్ణయం తీసుకుందో ఇప్పటికీ, ఎప్పటికీ అదే నిర్ణయంతో కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా పార్టీ పనిచేస్తుందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, వనరులను సమకూర్చటానికి పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. పార్టీని వీడిన నాయకులంతా వారి వ్యక్తిగత విషయాల పై రాజీనామాలు చేశారని, అలాంటివారు పోవటం వల్ల పార్టీకి ఏమాత్రం నష్టం లేదన్నారు.  
 
 ఊపిరి ఉన్నంతవరకూ పార్టీకోసం పనిచేస్తా....
 రాష్ట్రం వీడిపోయినా రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే బలంగా ఉంటుందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.  ప్రజల మనోగతం అర్థం చేసుకొని వారి అవసరాలకు అనుగుణంగా పరిపాలించే సత్తా..., వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి అందించగలిగే దమ్ము, ధైర్యం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ,  సిద్ధాంతాలు ముఖ్యమన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీకోసం పనిచేస్తానని పేర్కొన్నారు.
 
 సీజీసీ సభ్యులు చందా లింగయ్య మాట్లాడుతూ ప్రజల కోసం పుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా విప్లవంలా రాష్ట్రం నలుమూలల విస్తరించిందన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాలపై విసుగుచెంది కొత్తపార్టీగా వచ్చిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్  పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్  సంక్షేమ పథకాలు అందించేందుకు నేనున్నానంటూ వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముందుకువచ్చారని, ప్రజల్లో విపరీతమైన ప్రేమ, అనురాగం, విశ్వాసం నేటికీ చెక్కుచెదరలేన్నారు.
Share this article :

0 comments: