నాడు మహానేత! నేడు నేరస్తుడా?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు మహానేత! నేడు నేరస్తుడా?!

నాడు మహానేత! నేడు నేరస్తుడా?!

Written By news on Friday, June 8, 2012 | 6/08/2012

మరి కాంగ్రెస్ ‘సున్నా’ అయినప్పటికీ రాజశేఖరరెడ్డికి అంతటి ప్రజాదరణ ఇప్పటికీ ఎలా ఉంది? పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయనకున్న ‘ఇమేజ్’గా దానిని చూడవలసి ఉంటుంది. మరణానంతరం వైఎస్‌ని ఆయన పాలనా పద్ధతుల్ని, నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ తమకు సంబంధం లేనివిగా చూడ్డానికి సిద్ధపడింది. అంటే, వైఎస్ రాష్ట్రంలో అమలుచేసిన ఏ ఒక్క పథకానికి గానీ, కార్యక్రమానికి గానీ కాంగ్రెస్ అధిష్టానం సలహాలు సూచనలు లేవన్నమాటే కదా! అంటే తనకు తానుగా తన మహాపాదయాత్రతో మొదలుపెట్టి పార్టీని గెలిపించి, పాలనా పగ్గాలు చేపట్టి అమలుచేసిన ప్రతి పథకానికి ఇందిర, రాజీవ్‌ల పేరు పెట్టినది మొదలు, రెండవ టర్మ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరకు సమస్తం ఆయన తనదైన సొంత శైలిలో చేశారన్నమాట.

ఈ పరిణామక్రమంలో మనకు స్థూలంగా కనిపిస్తున్నది ఏమిటి? పరిధులు దాటి పనిచేయడం. ఒకప్పుడు ఎన్టీఆర్ అలా చేశారంటే, అది వేరు. ఆ పార్టీకి ఆయనే ఆది, అంతమూ కూడా. కానీ ఇది కాంగ్రెస్. ఇక్కడ అసలు పనిచేయనక్కరలేదు. పార్టీ ఒకసారి అధికారం అప్పగించి ముఖ్యమంత్రిని చేశాక, పదవికి చేటు వచ్చేంతవరకు అధికారాన్ని అనుభవిస్తూ కాలక్షేపం చేసేయవచ్చు. మరి ఇటువంటి వెసులుబాట్లు అన్నీ ఉండి కూడా వైఎస్ పనిచేశాడు. అది కూడా పరిధులు మించి మరీ పనిచేశాడు. చెప్పినదానికంటే ఎక్కువ చేయడం అంటే ఇదే! అదే ఆయన జీవించి ఉంటే? ఒక మనిషి చావుబతుకులు ప్రధానంగా భౌతికాంశం అవుతుంది గాని... బతికుంటే మహానుభావుడు, మరణిస్తే నేరస్తుడు ఎలా అవుతారు? వైఎస్ విషయంలో, కాంగ్రెస్ విషయంలో ఇది ఓ చిత్రమైన నమ్మశక్యం కాని సందర్భం.
 

ఒక్కొక్కసారి అంతే... సారూప్యత అసలే లేని ఇద్దరు వ్యక్తుల గురించి ఒకే సారి మాట్లాడుకోవలసివస్తుంది. కాలం చెప్పే తీర్పులు ఊహించని విధంగా ఉంటాయి కనుక ఈ పరిస్థితి తప్పదు. లేకపోతే ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంటుకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ఒక్కచేత్తో రెండు విజయాలను సాధించి 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిన నాయకుడు ఒక్కసారిగా ప్రతినాయకుడు కావడమేమిటి! అందరం చనిపోతాం. కాకపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు అకాలమరణం చెందారు. అయినా అదే రాజ్యాంగం, అవే చట్టాలు, అదే న్యాయవ్యవస్థ, అవే నియంత్రణ వ్యవస్థలు, అన్నిటికీ మించి అదే ప్రధానమంత్రి, అదే పార్టీ అధ్యక్షురాలు. అతడు చనిపోయాడు, ఇప్పుడు లేడు కనుక... వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు నేరస్తుడు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్వహించే పలు ఢిల్లీ స్థాయి ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశాల్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అనుసరిస్తున్న పద్ధతుల్ని ఒక్కసారీ వారు తప్పని అన్నది లేదు. పైగా, ‘ఏపీ మోడల్’ అనే ఒక కొత్త పదం వైఎస్ పాలనా కాలంలో వాడుకలో ఉండేది. 

దాన్ని అనుసరించమని ఈ సమీక్షా సమావేశాల్లో సదరు పెద్దలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవు పలికేవారు. మరి ఇప్పుడు?! విస్మయకరంగా 2004-2009 మధ్య ఐదేళ్ల కాంగ్రెస్ పాలనా కాలాన్ని వైఎస్ కారణంగా కాంగ్రెస్ తనకు తానే ‘సున్నా’ చేసుకోవడానికి నిర్ణయించు కుంది. సరే, మరి నడుస్తున్న టర్మ్ సంగతి ఏమిటి? తెలిసిందే! అంటే ప్రజలు పదేళ్ల కాలానికి ఇచ్చిన తీర్పును తనకు తానే సున్నా చేసుకున్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టమవుతూ ఉంది. మరి కాంగ్రెస్ ‘సున్నా’ అయినప్పటికీ రాజశేఖర రెడ్డికి అంతటి ప్రజాదరణ ఇప్పటికీ ఎలా ఉంది? పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆయనకున్న ‘ఇమేజ్’గా దానిని చూడవలసి ఉంటుంది. మరణానంతరం వైఎస్‌ని, ఆయన పాలనా పద్ధతుల్ని, నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ తమకు సంబంధం లేనివిగా చూడ్డానికి సిద్ధపడింది. 

అంటే, రాష్ట్రంలో వైఎస్ అమలు చేసిన ఏ ఒక్క పథకానికి గానీ కార్యక్రమానికి గానీ కాంగ్రెస్ అధిష్టానం సలహాలు, సూచనలు లేవన్నమాటే కదా! అంటే తనకు తానుగా తన మహాపాదయాత్రతో మొదలుపెట్టి పార్టీని గెలిపించి, పాలనా పగ్గాలు చేపట్టి అమలుచేసిన ప్రతి పథకానికి ఇందిర, రాజీవ్‌ల పేరు పెట్టినది మొదలు, రెండవ టర్మ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరకు సమస్తం ఆయన తనదైన సొంత శైలిలో చేశారన్నమాట. ఈ పరిణామక్రమంలో మనకు స్థూలంగా కనిపిస్తున్నది ఏమి టి? పరిధులు దాటి పనిచేయడం. ఒకప్పుడు ఎన్టీఆర్ అలా చేశా రంటే, అది వేరు. 

ఆ పార్టీకి ఆయనే ఆది, అంతమూ కూడా. కానీ ఇది కాంగ్రెస్. ఇక్కడ అసలు పనిచేయనక్కరలేదు. పార్టీ ఒకసారి అధి కారం అప్పగించి ముఖ్యమంత్రిని చేశాక, పదవికి చేటు వచ్చేంత వరకు అధికారాన్ని అనుభవిస్తూ కాలక్షేపం చేసేయవచ్చు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసేదీ, చేస్తున్నదీ అదే. పోనీ నరేంద్రమోడీ, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటి వారు ఉన్నారంటే వాళ్ల పరిస్థితి వేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీ కాదు కనుక వాళ్లు పనిచేసి మరీ తమను తాము నిరూపించుకోవాలి. 

మరి ఇటువంటి వెసులుబాట్లు అన్నీ ఉండి కూడా వైఎస్ పనిచేశారు. అది కూడా పరిధులు మించి మరీ పనిచేశారు. నిజానికి ఇదంతా అక్కర్లేని, తెచ్చి పెట్టుకున్న బరువు! ఆయన అక్కడితో ఆగలేదు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కూడా ఆయన స్వయంగా నిర్దేశించుకున్న లక్ష్యం. చెప్పినదానికంటే ఎక్కువ చేయడం అంటే ఇదే! అదే ఆయన జీవించి ఉంటే? ఒక మనిషి చావుబతుకులు ప్రధా నంగా భౌతికాంశం అవుతుంది గానీ... బతికుంటే మహానుభావుడు, మరణిస్తే నేరస్తుడు ఎలా అవుతారు? వైఎస్ విషయంలో, కాంగ్రెస్ విషయంలో ఇది ఓ చిత్రమైన నమ్మశక్యం కాని సందర్భం.

అయినా ప్రభుత్వాలను ఎప్పుడూ ‘ఐదేళ్ల యూనిట్’గా చూడ టం మనకు మొదటినుంచీ ఉన్న అలవాటు. ఒక శకలం మాదిరిగా అదెక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. 2004-09 నాటి ప్రభుత్వం అంతకు ముందు 2004 వరకు ఉన్న ప్రభుత్వానికి కొనసాగింపుగానే (స్థూలంగా) పనిచేయవలసి ఉంటుంది. ఉదాహరణకు 1991-2000 మధ్య రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు 4 లైన్ల హైవేలుగా రూపుదిద్దుకున్నాయి. 

వాటిని మధుకాన్- బీనాపురి, గాయత్రి కన్‌స్ట్రక్షన్స్, సామా వంటి జాతీయ, అంతర్జాతీయ ఇంజనీరింగ్ కంపెనీలు నిర్మించాయి. ఇటువంటి పనులు 5 ఏళ్ల కాలపరిమితిలో పూర్తి అయ్యేవి కావు. ఈ లోపు ప్రభుత్వాలు మారవచ్చు. వచ్చిన కొత్త ప్రభుత్వం ‘‘ఈ పనులు నేను డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగిస్తాను’’ అని అన లేదు. కొన్నికొన్ని పనులు వాటి స్థాయి, గతంలో ఉన్న అనుభవం, అందుకయ్యే వ్యయం మొదలైన వాటిని బట్టి అవి ఎవరు చెయ్యాలో నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడే ఒకమాట చెప్పుకోవాలి. 

ఒకప్పుడు ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేసేవి. వ్యవసాయం, పరిశ్రమలు ప్రాతిపదికగా ప్రణాళికలు ఉండేవి. కానీ 1991లో పీవీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ అనంతరం అభివృద్ధి, సంక్షేమంతోపాటు వాణిజ్యం కూడా అదనంగా వచ్చిచేరింది. 50 ఏళ్ల క్రితం అనుకుంటాను ఎన్టీఆర్ ‘లక్షాధికారి’ సినిమా వచ్చింది. కానీ ఇప్పుడు లక్షల్ని దిగువ మధ్య తరగతికి వదలి సంపన్నులు కోట్ల వైపుకు వెళ్లి చాలా కాలమైపోయింది. ఒక పెద్ద వ్యాపారం చేయాలంటే వందల కోట్ల పెట్టుబడులు పెట్టడం సర్వ సాధారణమైపోయింది.

ఈ మారిన పరిస్థితి ఎటువంటి సంస్కరణలు లేకుండా యథాతథంగా ఉన్న మన ‘లెజిస్లేచర్’, ‘ఎగ్జిక్యూటివ్’, ‘జ్యుడీషియరీ’కి మోయలేనంత భారంగా పరిణమించింది. ‘బిగ్ మనీ’ కుదుపుల్ని తట్టుకుని నిలదొక్కుకోవడం గాని, స్థిరపడి దీటుగా వెల్లువలావస్తున్న ‘ప్రైవేట్’ ఉరవడిని తట్టుకోవడం గాని దానికి కష్టమవుతున్నది. 

‘2జీ’గా అందరికీ తెలిసిన ‘ఆంత్రాక్స్-డివోస్’ డీల్‌లో జాతీయస్థాయిలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆరోపణలు ఎదుర్కోవడాన్ని ఎలా చూడవలసి ఉంటుంది? యావత్ ప్రపంచంలో ‘అవినీతి’ ఇప్పుడు ఒక పదం కాదు, అది ఒక శబ్దం! చెవుల్ని హోరెత్తించే నిరంతర ఘోష. కనుక ఇక ముందు అది ఎలా ఉండాలీ అనేది, ప్రజాస్వామ్యాన్ని వారు ఎలా నిర్వచించు కుంటారో తేల్చుకోవలసిన కొత్తతరం పని. అంతేకాని వృత్తి రాజకీయ నాయకులది కాదు.

మారిన ఈ కొత్త పరిస్థితుల్లో ఐదేళ్ల కోసం పని చేసే నాయకులు, 60 ఏళ్ల దాకా సర్వీసు చేయవలసిన ఉన్నతాధికారులు ఇరువురూ ఒకే తీరుగా బ్యాలెన్స్ కోల్పోవడం ఇప్పుడు మనముందు స్పష్టమవుతోన్న కొత్త దృశ్యం. క్రిస్టొఫర్ కొలంబస్ కొత్త దేశాల అన్వేషణకు అట్లాంటిక్ మీదుగా నౌకాయానం చేస్తూ, తన పర్యటనను ‘స్పాన్సర్’ చేయమని 1485లో పోర్చు గల్ రాజు రెండవ జాన్ వద్ద ఒక ప్రతిపాదన పెడతాడు. 

తను కనుగొన్న కొత్త ప్రాంతాలలో ఒక దానికి తనను గవర్నర్‌ను చేయాలని, ఆ దేశాల నుంచి స్పెయిన్ వసూలు చేసే శిస్తులో రూపాయికి 10 పైసల వాటా తనకు ఇవ్వాలని అడుగు తాడు. పోర్చుగల్ రాజు అందుకు ఒప్పుకోడు. దానితో కొలంబస్ ఇదే ప్రతి పాదనతో మరికొందరు ఇతర చక్రవర్తులను కలుస్తాడు. అక్కడా పని జరగక చివరకు మళ్లీ మొదటికే వచ్చి ఈసారి రెండవ జాన్ భార్య ఇసబెల్లా ద్వారా తన ప్రతిపాదనను 1492లో రాజుతో ఒప్పిస్తాడు. 

పలు వాణిజ్య లావాదేవీలు జరిగిన తరువాత కొన్ని ఆరోపణలతో కొలంబస్ 1500వ సంవత్సరంలో అరెస్టు అవుతాడు. కొలంబస్ మరణించినప్పటికీ వదలని అధికారులు, తండ్రి తరఫున అతని కొడుకులు డిగో, ఫెర్నాండోలను చాన్నాళ్లు కోర్టుల చుట్టూ తిప్పారు. 1790 వరకూ ఆ కేసులు సాగాయి. కాలం- ప్రాంతం ఏదైనా న్యాయం, చట్టం ఎప్పుడూ ఉంటాయి. కానీ ప్రపంచ గమనాన్ని ఒక కుదుపుతో ముందుకు తీసుకొని వెళ్లినవాడుగా కొలంబస్ శాశ్వతంగా చరిత్రలో మిగిలి పోయాడు.

ఇక పరిధులు, ప్రమేయాలను మరొక కోణంలోంచి చూద్దాం. రాష్ట్రంలో కొన్ని వందల మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారిలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ఒకరు. మిగతా అందరు అధికారుల మాదిరిగానే ఆయనా తన ఉద్యోగం చేసుకుంటున్నారు. 

కానీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం ఆయన మీడియాలో కనిపిస్తున్నారు. అది ఆయనకు సంబంధం లేని అంశం. అలాగే కోర్టులు, సీబీఐ, ఇతర చట్టాలు ఇవన్నీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారిగా సీబీఐ డిప్యుటేషన్‌లోకి రాకముందూ ఉన్నాయి, తరువాతా ఉంటాయి. (కేంద్ర సీబీఐ డెరైక్టర్‌గా చేసిన అధికారి ఒకరు రిటైర్ అయ్యాక మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు.) విషయం చిన్నదే. 

ఎవరైనా గాని అది సీఎంగా వైఎస్ అయినా, సీబీఐ సంస్థ జేడీగా లక్ష్మీనారాయణ అయినా తమ పరిధులు మించి పనిచేయవలసిన అవసరం ఉందా? పోనీ ఐదేళ్లకు ఒకసారి ప్రజాతీర్పు కోసం ఓటర్ల వద్దకు వెళ్లవలసిన నేతల అవసరాలు వేరు. బ్యూరోక్రాట్లకు ఎందుకీ ‘అతి’? పౌరపాలనలో మౌలికమైన మార్పులు ఏవీ ఇటీవలి కాలంలో జరగలేదు. ఒక పార్టీ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్లు పనిచేసిన కొందరు అధికారులు ఇప్పటికే ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అటువంటప్పుడు రెండవ టర్మ్‌లో పనిచేస్తున్న ఈ ‘అతి’ అధికారులు రాబోయే కాలంలో ఆ స్థానాలను భర్తీ చేయరని ఎక్కడుంది? ఒకనాడు ‘హీరో’లు అన్న నాయకులను మరణానం తరం ‘జీరో’లు చేస్తున్నప్పుడు, రేపు ఈ అధికారులకు రాయితీ ఉంటుందా?

నిజానికి ఉద్యోగులు, అధికారులు పాలనాపరమైన ప్రవర్తనా నియమావళి పరిధిలో పనిచేయవలసి ఉంటుంది. అయినా అధికారంలో ఉండే ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. వాటికి లొంగడం కూడా ఉంటుంది. ‘సాక్షి’ మీడియా విషయంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే. ఒక్కొక్క ప్రభుత్వం అవసరం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. నాయకుల ప్రయోజనాలు వ్యక్తిగతమూ, తాత్కా లికమూ అయినప్పుడు పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నట్లే ఉంటుంది. వారు తాము కూర్చున్న కొమ్మను నరకడానికి గొడ్డలిని కొందరు అధికారులకు ఇవ్వవచ్చు! నరికే ప్రక్రియను వేగవంతం చేయడానికి వేగిరపెట్టవచ్చు. 

అటువంటి ఉత్తర్వులు జారీ చేసే సమయానికి కొందరు ఆ సీట్లలో ఉండటం యాదృచ్ఛికం కావచ్చు. కానీ, కొన్నికొన్ని రకాల మరకల్ని చేతికి అంటుకో కుండా చూసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక పౌర ప్రభుత్వాలు అన్నీ గౌరవిస్తున్న హక్కు... పత్రికా స్వేచ్ఛ! దాన్ని హరించినవారు మరొక ‘టర్మ్’లో నేరస్తులు కారన్న నమ్మకం లేదు. అంతేకాదు జీవితకాలంలోనే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది చరిత్ర నిగ్గుదేర్చిన నిజం! 

- ఫొటో: జి.అమర్ 
Share this article :

0 comments: