'పీఆర్పీ కలిసినా కాంగ్రెస్ కు తగ్గిన బలం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పీఆర్పీ కలిసినా కాంగ్రెస్ కు తగ్గిన బలం'

'పీఆర్పీ కలిసినా కాంగ్రెస్ కు తగ్గిన బలం'

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

ప్రజారాజ్యం పార్టీ కలిసినా కాంగ్రెస్ పార్టీలో బలం తగ్గిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎవరిపైన రానివిధంగా పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నట్లు చిరంజీవిపై ఆరోపణలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ను తిట్టిన చిరంజీవి చివరకు కాంగ్రెస్‌లోనే చేరారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఓటేస్తే శోభానాగిరెడ్డిని వివరణ కోరారు.

రాష్ట్రంలో గనులకు సంబంధించి కొన్ని పత్రికలు చాలా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నాయన్నారు. అలా రాయడం వల్ల ఆ పత్రికల విలవలే పతనం అవుతాయన్నారు. ఇక్కడి గనులు తమక వద్దని అప్పట్లో ఎన్ ఎండిసి చెప్పినట్లు తెలిపారు. ఎన్ ఎండిసి టర్నోవర్ పది వేల కోట్ల రూపాయలు అని ఆయన తెలిపారు. ఇది కేవలం టర్నోవర్ మాత్రమేనని, లాభం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ పత్రికలు అర్ధపర్ధంలేకుండా ఇష్టం వచ్చినట్లు అసత్యాలు రాస్తున్నారని తెలిపారు. అలా రాయడం వల్ల ఆ పత్రికల క్రెడిబిలిటీ పోతుందన్న ఆలోచన కూడా వారికి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోబోతున్నాయన్నారు. పార్టీలకు మద్దతు తెలిపే పత్రికలపై చీటింగ్ కేసులు పెట్టడం కాదని, వారిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. 
Share this article :

0 comments: