సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా?

సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా?

Written By news on Wednesday, September 18, 2013 | 9/18/2013

మరో కుట్రకు శ్రీకారం: అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునా యుడు మరోసారి కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ పెట్టుకున్న ప్రతీసారీ తన భజన బృందాన్ని ఢిల్లీ పంపి రాద్ధాంతం చేయడం బాబుకు పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయనుకున్న దశలో వారి ఎంపీల చేత సీవీసీ, ఈడీ, సీబీఐలకు వినతి పత్రాలు ఇప్పిస్తూ... చంద్రబాబు తాజాగా మరో నాటకానికి తెర లేపారని మండిపడ్డారు.
 
 జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకు బహిరంగంగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీలు తెరచాటున మరెన్ని బాగోతాలు నడిపిస్తున్నారో అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. ‘జగన్‌పై కేసు దర్యాప్తు 2011 ఆగస్టు 10న ప్రారంభమైంది. జగన్‌ను విచారణ పేరుతో పిలిచి 2012 మే 27న అక్రమంగా అరెస్ట్ చేశారు. 16 నెలలుగా నిర్బంధంలో ఉంచారు. ఈ దేశంలో ఏ వ్యక్తినీ 90 రోజులకు మించి నిర్బంధంలో ఉంచకూడదని సీఆర్‌పీసీ చెబుతోంది. అయినా న్యాయస్థానాలు సీబీఐకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి.
 
 అన్ని అంశాల మీద దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 9లోగా చార్జిషీట్ వేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఆ తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా?’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు. విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ, సీవీ
Share this article :

0 comments: