నేనున్నాననీ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేనున్నాననీ...

నేనున్నాననీ...

Written By news on Monday, February 23, 2015 | 2/23/2015


నేనున్నాననీ...
 రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ఆత్మహత్యలకు పాల్పడుతున్న ‘అనంత’ అన్నదాతలకు భరోసా కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ ప్రజలు ఘన స్వాగతం కలిపారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ ఆదివారం ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టుకు వచ్చారు. జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, హిందూపుం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు శ్రీధర్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్ స్వాగతం పలికారు.
 
 అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుండి మరవపల్లి, వీరాపురం మీదుగా చిలమత్తూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి దేమకేతేపల్లి, టేకులోడు, కనుమ, గాదాలపల్లి, గొంగటిపల్లి మీదుగా మామిడిమాకులపల్లికి చేరుకున్నారు. ప్రతి గ్రామంలోనూ జగన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. మహిళలు, వృద్ధులు, యువకులు రాగా అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. చిన్నపిల్లలకు ముద్దాడుతూ.. ఆశీర్వదిస్తూ చిరునవ్వుతో ముందుకుసాగారు.  యువ కులతో కరచాలనం చేశారు.
 
 సిద్ధప్ప కుటుంబానికి పరామర్శ మామిడిమాకులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న సిద్ధప్ప(65)కుటుంబాన్ని పరామర్శించారు. సిద్ధప్ప భార్య రంగమ్మ, కుటుంబీకులతో ముచ్చటించారు. సిద్ధప్ప ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, అప్పుల వివరాలు, ప్రస్తుత జీవనాధారం వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.
 
 వారిని పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి లేపాక్షికి చేరుకున్నారు. లేపాక్షిలో జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచి భారీగా జనం ఎదురు చూశారు. జగన్ రాగానే ఈలలు, కేకలతో లేపాక్షి మార్కెట్ సర్కిల్ హోరెత్తింది. లేపాక్షిలో మసీదులోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత బీఈడీ చేసిన నిరుద్యోగులు జగన్‌నను కలిశారు. బీఈడీ ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తాము నష్టపోతున్న విధానాలను వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ భరోసా నిచ్చారు. తర్వాత బిసలమానేపల్లిలో అలచంద తోటలోకి వెళ్లారు. మహిళా రైతును పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రికల్చర్ అధికారులు కనీసం పంటలు చూసేందుకు రావడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఏడాదిలో నాలుగైదుసార్లు అధికారులు తమ పొలంలోకి వచ్చేవారన్నారు.
 
  పొలంలోనే గోవిందమ్మ అనే మరో మహిళా రైతుతో మాట్లాడారు. ఏ పంటసాగు చేసినా నష్టం వస్తోందని, సాగునీరు లేదని ఆమె చెప్పారు. తర్వాత దారిలో గొర్రెలకాపరి ఎదురై జగన్‌కు గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. ఆపై పూలకుంట చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలు తమకు రుణమాఫీ అమలులో ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జగన్‌కు వివరించారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. అక్కడి నుండి శ్రీకంఠాపుం మీదుగా హిందూపురం పట్టణానికి చేరుకున్నారు. హిందూపురం శివార్లలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
 
 ఆలస్యమైనా ఎదురుచూపు
  సాయంత్రం 5 గంటలకు హిందూపురానికి చేరుకోవాల్సిన జగన్ రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడటం, వచ్చిన వారందరినీ జగన్ ఆప్యాయరంగా పలకరించడంతో పర్యటన 2.30గంటలు ఆలస్యంగా సాగింది. అయినా జనం అలుపెరుగకుండా ఎదురుచూశారు. రాత్రి 7.30 హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన పరిస్థితులు, రైతన్నకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్న వైనంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. బహింరంగ సభ అనంతరం అక్కడ నుండి నేరుగా పుట్టపర్తి నియోజకవర్గం తలమర్ల సమీపంలోని చెన్నకేశవాపురానికి వెళ్లారు. అక్కడ బస చేశారు. జగన్ తొలిరోజు పర్యటన 91 కిలోమీటర్లు సాగింది. జగన్ పర్యటనలో నియోజవకర్గ ఇన్‌చార్జ్‌లు ఆలూరు సాంబశివారెడ్డి, ఉషాచరణ్, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట సూర్యప్రకాశ్‌బాబు, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్, సేవాదల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి,  ఓబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు బాబుల్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
 
 నేటి ‘రైతు భరోసా యాత్ర’ సాగుతుందిలా..
 సోమవారం ఉదయం తలమర్ల సమీపంలోని చెన్నకేశవపురం నుంచి జగన్ కొత్తచెరువు మండలం మరుకుంటపల్లికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కురబ కేశప్ప(55) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుండి కొత్త చెరువు చేరుకుంటారు. డ్వాక్రా మహిళలతో వారి సమస్యలపై చర్చిస్తారు. ఆపై అక్కడి నుండి బుక్కపట్నం మీదుగా కొత్తకోట చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పిస్తారు. తర్వాత అక్కడ నుండి నేరుగా అనంతపురానికి చేరుకుని రాత్రికి బస చేస్తారు.
 
 ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే... అప్పుల కుంపటి గుండెను రాజేస్తుంటే.. బతుకు భారమై వలసబాట పట్టిన రైతులు కొందరైతే.. అప్పుల బాధ తాళలేక              బలవన్మరణానికి పాల్పడిన వారు మరికొందరు. ఆదుకోవాల్సిన పాలకపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వేళ ‘నేనున్నానంటూ’ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు  ‘రైతు భరోసా యాత్ర’ ప్రారంభించారు. ఆదివారం జిల్లాలో ప్రారంభమైన యాత్రకు జనం నీరాజనం పలికారు. తమ కోసం వచ్చిన నాయకుడికి ఆత్మీయ స్వాగతం పలికి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఎల్లవేళలా మీకు తోడూ..నీడగా ఉంటానంటూ భవిష్యత్‌పై వారికి జగన్ భరోసా కల్పించారు.   
 
 భార్య రంగమ్మ, కుటుంబీకులతో ముచ్చటించారు. సిద్ధప్ప ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, అప్పుల వివరాలు, ప్రస్తుత జీవనాధారం వివరాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి లేపాక్షికి చేరుకున్నారు. లేపాక్షిలో జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచి భారీగా జనం ఎదురు చూశారు. జగన్ రాగానే ఈలలు, కేకలతో లేపాక్షి మార్కెట్ సర్కిల్ హోరెత్తింది. లేపాక్షిలో మసీదులోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత బీఈడీ చేసిన నిరుద్యోగులు జగన్‌నను కలిశారు. బీఈడీ ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, తాము నష్టపోతున్న విధానాలను వివరించారు. వారికి అండగా ఉంటామని జగన్ భరోసా నిచ్చారు. తర్వాత బిసలమానేపల్లిలో అలచంద తోటలోకి వెళ్లారు.
 
 మహిళా రైతును పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రికల్చర్ అధికారులు కనీసం పంటలు చూసేందుకు రావడం లేదన్నారు. వైఎస్ హయాంలో ఏడాదిలో నాలుగైదుసార్లు అధికారులు తమ పొలంలోకి వచ్చేవారన్నారు. పొలంలోనే గోవిందమ్మ అనే మరో మహిళా రైతుతో మాట్లాడారు. ఏ పంటసాగు చేసినా నష్టం వస్తోందని, సాగునీరు లేదని ఆమె చెప్పారు. తర్వాత దారిలో గొర్రెలకాపరి ఎదురై జగన్‌కు గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చారు. ఆపై పూలకుంట చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళలు తమకు రుణమాఫీ అమలులో ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జగన్‌కు వివరించారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. అక్కడి నుండి శ్రీకంఠాపుం మీదుగా హిందూపురం పట్టణానికి చేరుకున్నారు. హిందూపురం శివార్లలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
 
 ఆలస్యమైనా ఎదురుచూపు
 సాయంత్రం 5 గంటలకు హిందూపురానికి చేరుకోవాల్సిన జగన్ రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. అడుగడుగునా జగన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడటం, వచ్చిన వారందరినీ జగన్ ఆప్యాయరంగా పలకరించడంతో పర్యటన 2.30గంటలు ఆలస్యంగా సాగింది. అయినా జనం అలుపెరుగకుండా ఎదురుచూశారు. రాత్రి 7.30 హిందూపురంలో అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన పరిస్థితులు, రైతన్నకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్న వైనంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.
 బహింరంగ సభ అనంతరం అక్కడ నుండి నేరుగా పుట్టపర్తి నియోజకవర్గం తలమర్ల సమీపంలోని చెన్నకేశవాపురానికి వెళ్లారు.
 
 
 అక్కడ బస చేశారు.  జగన్ తొలిరోజు పర్యటన 91 కిలోమీటర్లు సాగింది. జగన్ పర్యటనలో నియోజవకర్గ ఇన్‌చార్జ్‌లు ఆలూరు సాంబశివారెడ్డి, ఉషాచరణ్, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట సూర్యప్రకాశ్‌బాబు, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్‌యూనియన్, సేవాదల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి,  ఓబులేసు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు బాబుల్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: