అధైర్యపడకండి... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధైర్యపడకండి...

అధైర్యపడకండి...

Written By news on Tuesday, February 24, 2015 | 2/24/2015


అధైర్యపడకండి...
పుట్టపర్తి: ‘ఎవరూ అధైర్య పడొద్దు. కష్టాలను సమష్టిగా ఎదుర్కొందాం. మీకు మేము అండగా ఉంటాం’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. రైతు భరోసా యాత్ర రెండో రోజు సోమవారం ఆయన అనంతపురం జిల్లా మరుకుంటపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కురుబ కేశప్ప (50) కుటుంబాన్ని పరామర్శించారు. కేశప్ప భార్య నాగలక్ష్మి, కుమారులు చండ్రాయుడు, చంద్ర, కుమార్తె శ్యామల, అల్లుడు లక్ష్మీనారాయణ, చెల్లెలు సుబ్బమ్మ, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్, కేశప్ప కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ ఇలా సాగింది.
 జగన్: ఏమ్మా బాగున్నారా?
 నాగలక్ష్మమ్మ (కేశప్ప భార్య), చండ్రాయుడు, చంద్ర, శ్యామల (కేశప్ప కుమారులు, కుమార్తె): బాగున్నాం సార్
 జగన్: మీ పేరేంటమ్మా?
 నాగలక్ష్మమ్మ: నాగలక్ష్మమ్మ సార్.
 జగన్: పిల్లలెంతమంది తల్లీ?
 నాగలక్ష్మమ్మ: ఇద్దరు కొడుకులు, కూతురు సార్. కూతురుకు పెండ్లి చేసినాము సార్. పెద్ద కొడుకు చండ్రాయుడు ఇంటి దగ్గరే సేద్యం సేత్తాడు. చిన్న కొడుకు చంద్ర బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తాడు సార్.
 జగన్: కేశప్ప ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది?
 నాగలక్ష్మమ్మ: మాకు మూడెకరాల పొలం ఉంది సార్. కొత్తచెరువు ఆంధ్రాబ్యాంక్‌లో 60 వేల రూపాయలు లోన్ తీసుకున్నాం. వాన్లు పడక ఉన్న బోరులో నీళ్లు రాలేదు. భూములు బీడు పెట్టలేక రెండు బోర్లు ఏసినాము. కూతురు పెండ్లి చేసినాము. సేద్యానికి అంతటికీ కలిపి బయట ఒడ్డికి  రెండున్నర లచ్చలు తీసుకోండాం సార్.  చేసిన అప్పులు ఎట్ల తీర్చాలో దిక్కుతెలీక ఇంట్లోనే ఉరేసుకుని సనిపోయినాడు సార్.
 జగన్:  ఎంత రుణం మాఫీ అయిందమ్మా?
 నాగలక్ష్మమ్మ, అక్కడే ఉన్న గ్రామానికి చెందిన సహకార సంఘం డెరైక్టర్ ఈశ్వర్‌రెడ్డి: కొత్తచెరువు ఆంధ్రాబ్యాంక్‌లో లోన్ రూ.30 వేలు, రీషెడ్యుల్ రూ.30 వేలు మొత్తం 60 వేల రూపాయల లోన్‌కు గాను రూ.51 వేలు మాఫీ అయింది. (రుణమాఫీ హామీపత్రం చూపించారు) ఇప్పుడు 10,200 రూపాయలు అకౌంట్‌లో ఏసినామని చెప్పినారు. ఇంకా అందలేదు సార్.
 జగన్: ప్రభుత్వం నుండి సాయం
 అందిందా?
 నాగలక్ష్మమ్మ: ఎమ్మార్వో సారోల్లు లచ్చన్నర ఇస్తామన్నార్ సార్
 జగన్: సరేనమ్మా.. భయపడకుండా బతకండి. మీకు రూ.50 వేల చెక్కు ఇస్తున్నాం.  జాగ్రత్తగా ఉపయోగించుకుని కుటుంబాన్ని పోషించుకోండి. ఏ కష్టమొచ్చినా నాకు, ఇక్కడి వైఎస్సార్‌సీపీ నేతలకు చెప్పండి. అండగా ఉంటాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సమస్యలు తీరుస్తాం.
Share this article :

0 comments: