సిబిఐకి విశ్వసనీయత లేదు: హజారే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐకి విశ్వసనీయత లేదు: హజారే

సిబిఐకి విశ్వసనీయత లేదు: హజారే

Written By news on Sunday, June 3, 2012 | 6/03/2012

న్యూఢిల్లీ: సిబిఐకి విశ్వసనీయతలేదని ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే అన్నారు. వ్యక్తులు అధికారంలో ఉంటే ఒకలా, వారే ప్రతిపక్షంలో ఉంటే మరోలా సిబిఐ వ్యవహరిస్తోందని విమర్శించారు. సిబిఐ కేంద్ర జేబు సంస్థ అని, అది ప్రధానిపై ఏం దర్యాప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆరు నెలల తరువాత ప్రధానికి క్లీన్ చిట్ ఇస్తుందని విమర్శించారు. బొగ్గు కుంభకోణం కథ కంచికి చేరుతుందన్నారు. లలూ ప్రసాద్ యాదవ్, మూలాయం సింగ్, మాయావతి కేసుల దర్యాప్తు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని అవినీతి మంత్రులను జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


న్యూఢిల్లీ: ప్రభుత్వం తన వ్యతిరేకులను సీబీఐ వేధింపులకు గురిచేస్తుందని, తనకు సహకరించేవారిని మాత్రం వదిలివేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రామ్ దేవ్ బాబా దీక్షా శిబిరం వద్ద ఆయన ప్రసంగించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్, మాయావతిపై కేసులున్నప్పటికీ దర్యాప్తు సరైన పద్ధతిలో జరగడం లేదన్నారు. 
సీబీఐపై విశ్వాసం లేదని చెప్పారు. అలాంటి సంస్థలు ప్రధాని, మంత్రులపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు జరపలేవని ఆయన అన్నారు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉన్నాయని తెలిపారు. ప్రధానిసహా మంత్రులపై దర్యాప్తు జరిపేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం తాము ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు.
Share this article :

0 comments: