సీఎం కిరణ్ కు సిక్కోలులో నిరసనల సెగ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం కిరణ్ కు సిక్కోలులో నిరసనల సెగ

సీఎం కిరణ్ కు సిక్కోలులో నిరసనల సెగ

Written By news on Saturday, July 28, 2012 | 7/28/2012

"ఇందిరమ్మబాట" అంటూ బయల్దేరిన ముఖ్యమంత్రికి... నిరసనల సెగ తగిలింది. ప్రజల మధ్య ఉండటానికి తెగ ప్రయత్నిస్తోన్న సీఎం కిరణ్‌కి మాత్రం... అదే ప్రజల నుంచి కనీసం విన్నపాలు తీసుకోవడానికి ఇష్టం లేదు. కన్నెధార కొండ మైనింగ్‌ లీజును రద్దుచేయాలంటూ సిక్కోలు జనం కదం తొక్కితే- పోలీసులు లాఠీలతో కొట్టి ఈడ్చేశారు. సీఎం పర్యటనలో పోలీసుల వైఖరికి నిరసనగా- స్థానిక గిరిజనులు-నేడు సీతంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.
ప్రజల మధ్యకు వెళ్ళాలంటే- వారి సమస్యలు వినే ఓపిక ఉండాలి. వారి నిరసనలు తట్టుకునే ధైర్యం ఉండాలి. కానీ- ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఇవేవీ లేవని తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన వివాదాస్పదంగా మారింది. కన్నెధార కొండ మైనింగ్‌ లీజు అక్రమమని- స్థానికుల డిమాండ్‌. దాన్ని తక్షణం రద్దుచేయాలన్నది వారి డిమాండ్‌. ఈ విషయాన్ని సీఎంకు చెబుతామన్నది వీరి అభిమతం. పెద్దమేడుకు వెళుతున్న ముఖ్యమంత్రి... సీతంపేట మీదుగా వెళ్ళాల్సి ఉంది. సీఎం కాన్వాయ్‌ వాహనాలను అడ్డుకున్నారు.
రోడ్డుకడ్డంగా బురదలో కూర్చొని మహిళలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో గిరిజన నేత ముక్క లింగానికి స్వల్పంగా గాయాలయ్యాయి.
పెద్దమేడ నుంచి తిరిగివస్తోన్న ముఖ్యమంత్రిని మళ్ళీ కలవాలని సీతంపేటలో గిరిజనులు ఉండిపోయారు. అయితే పోలీసులు ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా- లాఠీచార్జ్‌ చేశారు. గిరిజనుల్ని చెదరగొట్టారు. దీనిపై గిరిజనులు మండిపడ్డారు.
పోలీసుల తీరుకు నిరసనగా... గిరిజనులు శనివారం సీతమ్మధార బంద్‌కు పిలుపునిచ్చారు. ఇంతా జరుగుతున్నా- ముఖ్యమంత్రి కనీసం ప్రజల నుంచి వినతిపత్రం స్వీకరించలేదు. ప్రజావాణిని వినిపించుకోలేదు. ప్రజలంటే ఇంత అలుసా..? ప్రజల సమస్యలంటే ఇంత లెక్కలేని తనమా..? ఈమాత్రం దానికి "ఇందిరమ్మబాట" పేరుతో ప్రజల్లోకి రావడం ఎందుకు..? ఇదీ ఈ గిరిజనులు అడుగుతున్న ఈటెల్లాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సీఎం గారి సమాధానం ఉందా..?


Share this article :

0 comments: