ఉనికి కోసం రెచ్చగొడుతున్న టిఆర్ఎస్:సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉనికి కోసం రెచ్చగొడుతున్న టిఆర్ఎస్:సురేఖ

ఉనికి కోసం రెచ్చగొడుతున్న టిఆర్ఎస్:సురేఖ

Written By news on Monday, July 23, 2012 | 7/23/2012

సిరిసిల్ల: ప్రజలను రెచ్చగొట్టి ఉనికి కాపాడుకోవడానికి టిఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయమ్మ చేపట్టిన దీక్షా శిబిరంలో ఆమె ప్రసంగించారు. చేనేత కార్మికులకు అండగా ఉంటానని చెప్పి విజయమ్మ పోరాటం చేస్తున్నారన్నారు. మన సమస్యలపై పోరాడటానికి వచ్చిన ఆడపడుచు పట్ల తెలంగాణ నేతలుగా ప్రవర్తించే తీరు ఇదేనా? అని ఆమె టిఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. నేత కార్మికులకు ఎందుకు అండగా నిలవడంలేదని ఆమె ప్రశ్నించారు. తామూ తెలంగాణవాదులమేనని చెప్పారు. తెలంగాణవాదం బలహీనపడలేదన్నారు. తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్ ఎంపిలను, ఎమ్మెల్యేలను వదిలివేసి, తమమీద తిరగబడటం

ఏమిటని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చేందుకు టిఆర్ఎస్ కు సెప్టెంబరు 15 డెడ్ లైన్ అని చెప్పారు. టిఆర్ఎస్ తో తెలంగాణ రాదని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. టిడిపి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రజలు తమ పార్టీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రజా సమస్యలు వినేది తమ పార్టీయేనని వారి నమ్మకం ఏర్పడిందని ఆమె చెప్పారు.

ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా వైఎస్ జగన్మోహన రెడ్డి ఉన్నారన్నారు. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తారని చెప్పారు. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పథకాలు అమలు చేశారన్నారు. మాజీ ఎంపి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ లను తీవ్రస్థాయిలో విమర్శించారు. లుచ్చా, లఫంగి పనులు చేస్తూ అందరినీ లుచ్చా, లఫంగి అంటావా? అని కెసిఆర్ ని ప్రశ్నించారు. ఇంకో రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పిన నువ్వే ఉద్యమం బలహీనపడిందనడంతో అర్ధం ఏమిటని కేసీఆర్ ని ప్రశ్నించారు.
Share this article :

0 comments: