ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ఇలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ఇలా...

ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ఇలా...

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012

అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఉరవకొండ నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆరు రోజుల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 
31న బుధవారం కమ్మూరు క్రాసు అగ్రిగోల్డ్ ఫంక్షన్‌హాల్ నుంచి ప్రారంభమై అరవకూరు, కూడేరు సరిహద్దుల్లో మధ్యాహ్నం విరామం, కూడేరులో బహిరంగసభ, ముద్దలాపురం గ్రామ సమీపంలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. మొత్తం 12 కిలోమీటర్లు నడుస్తారు. 

- నవంబర్ 1న ముద్దలాపురం, వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు సందర్శన, తరువాత మధ్యాహ్న విరామం, అక్కడి నుం చి జల్లిపల్లిలో బహిరంగసభ, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట దగ్గర రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 13 కిలోమీటర్లు. 

- 2న పెన్నహోబిలం పీఏబీఆర్ కాలవ పరిశీలన, కోనాపురం క్రాసు, మధ్యాహ్నం విరామం, షెక్షాన్‌పల్లిలో బహిరంగ సభ, అక్కడి నుంచి లత్తవరం సరిహద్దుల్లో రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు. 

- 3న లత్తవరం, ఉరవకొండ పోలీసు స్టేషన్ ఎదురుగా మధ్యాహ్నం విరామం, తర్వాత ఉరవకొండ టౌన్, ఇందిరానగర్, పాత స్టేట్‌బ్యాంకు, పార్కు ఆం జనేయస్వామి వీధి, పెద్దమసీదు ఏరియా, ఆర్యవైశ్య వీధి, గాంధీ విగ్రహం సర్కిల్ , బ్రాహ్మణవీధి, పంచాయతీ ఆఫీసు మీదుగా పాత బస్టాండు వద్ద గొప్ప బహిరంగ సభ. మార్కెట్ యార్డు వద్ద రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 10 కిలోమీటర్లు. 

- 4న గాలిమర్ల సర్కిల్ దగ్గర మధ్యా హ్న విరామం, పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హంద్రీనీవా కాలువ పరిశీలన, రాగులపాడు గ్రామంలో బి హరంగ సభ, రాత్రి అక్కడే బసచేస్తారు. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు. 

- 5న పందికుంట, తట్రకల్లు గ్రామ సరిహద్దులో మధ్యాహ్న విరామం, తట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. ఆ రోజు మొత్తం 11 కిలోమీటర్లు.

- 6న కమలపాడు క్రాసు, కమలపాడు గ్రామ సరిహద్దుల్లో మధ్యాహ్న విరామం, గూళ్యపాల్యం, కొనకొండ్లలో బహిరంగ సభ. అనంతరం గుంతకల్లు నియోజకవర్గంలో భీమా గార్డెన్స్‌లో రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తారు.
Share this article :

0 comments: