విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

విజయమ్మ సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Written By news on Thursday, January 9, 2014 | 1/09/2014

విజయమ్మ సహా వైఎస్ఆర్  సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్ : సస్పెన్షన్ ను నిరసిస్తూ అసెంబ్లీ గేట్.1 వద్ద ఆందోళనకు దిగిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు.  సమైక్యాంధ్ర గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు.. స్పీకర్ నాదెండ్ల మనోహర్ గురువారం సభను నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అనంతరం ఎమ్మెల్యేలు నిరసనకు దిగగా.... పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి లాక్కెళ్లారు. అనంతరం గోషా మహాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా అరెస్ట్ పై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వారు ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: