అపూర్వ ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అపూర్వ ఆదరణ

అపూర్వ ఆదరణ

Written By news on Wednesday, January 8, 2014 | 1/08/2014

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్.జగన్‌మోహన్ రెడ్డికి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రను మూడవ రోజై న మంగళవారం వాల్మీకిపురం నుంచి ప్రారంభించారు. వాల్మీకిపురంలోని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయల్దేరారు. శివపురం మీదుగా గంగాదొడ్డి చేరుకుని, వైఎస్ మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన ఒలిపి రామచంద్ర కుటుంబాన్ని ఓదార్చారు. తిరిగి వాల్మీకిపురం చేరుకుని, అక్కడ తోట వీధిలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణిం చిన రెడ్డిగౌస్ కుటుంబాన్ని ఓదార్చారు. తరువాత వాల్మీకిపురం జంక్షన్‌లో వేలాది మంది హాజరైన బహిరంగ సభలో ప్రసంగించారు.   బస్సుపై నుంచి ప్రసంగించి, కిందకు దిగిన ఆయనను కలుసుకోవాలని వచ్చిన అభిమా నులను చిరునవ్వుతో పలకరించారు.
 
  పలువురు జననేతను చూసేందుకు మిద్దెలపైకి, చెట్లపైకి ఎక్కారు. వాల్మీకిపురం ప్రభుత్వ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  అనంతరం పలువురు కుప్పంవాసులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. వారిని పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేశారు. వాల్మీకిపురంలో భోజనానంతరం ఆయన పునుగుపల్లె మీదుగా విఠలం చేరుకున్నారు. అక్కడ మహిళాకూలీలతో కొద్దిసేపు ముచ్చటించారు.   చింతరాపల్లి క్రాస్, యమండ్లపల్లెలో రోడ్ షో నిర్వహించారు. తరువాత చింతపర్తికి చేరుకుని, వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాతకోటపల్లె, బీదలవారిపల్లెలో రోడ్‌షో నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు హారతులు పట్టారు. గండబోయినపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత  అంధులు, వికలాంగులతో ముచ్చటించారు.  అక్కడి నుంచి కమ్మవారిపల్లె, బేకలకోన మీదు గా కలికిరి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇంది రమ్మ ఇళ్ల వాసులు జగన్‌మోహన్‌రెడ్డిపై పూల వర్షం కురిపించి స్వాగతించారు.
 
  నాలుగురోడ్ల జంక్షన్ వరకూ దారి పొడవునా పూలవర్షం కురిసింది.  కలికిరిలో విగ్రహావిష్కరణ చేశారు. అక్కడి నుంచి పొట్టేకులవారిపల్లె, సానుకూటపల్లె క్రాస్, ఈతమాను క్రాస్, ఎల్లంపల్లె క్రాస్, గట్టుపాళెం క్రాస్, ముదినేపల్లె క్రాస్, ఊటుపల్లె మీదుగా ఆయన కందూరుకు చేరుకుని పార్టీ నాయకుడు రవీంద్రనాథరెడ్డి ఇంట్లో బస చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర పీలేరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జర గగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరి శీలకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, డాక్టర్ సునీల్ కుమార్, పూర్ణం, రవి ప్రసాద్, వై.సురేష్ పాల్గొన్నారు.
 
 నేడు జగన్ యాత్ర సాగుతుందిలా
 సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర బుధవారం నాటి వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.
 
     సోమల మండలంలోని కందూరు నుంచి ప్రారంభమయ్యే యాత్రలో అదే గ్రామంలో ఉదయం శెట్టి చిన్నరెడ్డెప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు.
 
     చింతలపల్లెవారి క్రాస్, బురుజుపల్లె, తెట్టుపల్లె, ఈర్లపల్లె క్రాస్, చిన్నసోమల క్రాస్‌లలో రోడ్‌షో నిర్వహిస్తారు.  
 
     సోమలలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.  
     అడుసుపల్లె, సరస్వతీపురం, నింజంపేట, మల్లేశ్వరపురం, రాంపల్లె, కల మండవారిపల్లె మీదుగా పట్రపల్లె చేరుకుని అక్కడ సాదం మునస్వామి కుటుంబాన్ని ఓదారుస్తారు.
 
     కమ్మపల్లె, శీలంవారిపల్లె, తంగేనిపల్లె, సవరంవారిపల్లె, గాంధీనగరం, గురి కానివారిపల్లె, చెరుకువారి పల్లె మీదు గా సదుం మండలం చేరుకుంటారు.
 
     సదుం మండలంలో ఎన్.మతుకువారిపల్లె, నడిగడ్డ, హైస్కూల్‌గడ్డలో రోడ్ షో నిర్వహించి యర్రాతివారిపల్లెలో రాత్రి బస చేస్తారు.
 














Share this article :

0 comments: