సమైక్య పథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య పథం

సమైక్య పథం

Written By news on Sunday, January 5, 2014 | 1/05/2014

సమైక్య పథం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోరెత్తిన బైక్ ర్యాలీలు
వాడవాడలా మిన్నంటిన సమైక్య నినాదాలు
 
 సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచ రణలో భాగంగా శనివారం సీమాంధ్ర జిల్లాల్లో బైక్ ర్యాలీలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరసిస్తూ యువజనం కదం తొక్కింది. వాడవాడలా ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శనలు చేపట్టి సమైక్యనినాదాలు మార్మోగించింది.  అన్ని అసెంబ్లీ నియోజకవర ్గకేంద్రాల్లో ఆయా నియోజకవర్గసమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ నేతలు భీమిరెడ్డి, వెంకటేష్ శెట్టి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. రాఘవేంద్ర సర్కిల్ వద్ద కర్నూలు, కర్ణాటక రహదారిపై మోటార్ సైకిళ్లు అడ్డంగా పెట్టి రహదారిని దిగ్బంధించడంతో రాకపోకలు స్తంభించాయి.
 
 కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో, పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, రామచంద్రారెడ్డిల నాయకత్వంలో బైక్‌ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ లు జరిగాయి. కడపలో పార్టీ జిల్లా కన్వీనర్  సురేశ్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో 500కి పైగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.  పులివెందులలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 800 బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి,  మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీలు జరిగాయి. పలమనేరు, వి కోట, గంగవరం, శ్రీకాళహస్తి, కుప్పంలో జరిగిన బైక్ ర్యాలీల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారుు. గుంటూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన జరిగింది.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోనూ, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలోనూ, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, సీఈసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి గురజాలలోనూ, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త నన్నపనేని సుధ వినుకొండలోనూ, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త నాగార్జున వేమూరులోనూ, తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది.  గుంటూరు నగరంలో సిటీకన్వీనరు అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడలో నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, పి.గౌతమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు.  ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. పార్టీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పొదలకూరులో, నెల్లూరులో డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్,  బుజబుజనెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,  ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మర్రిపాడు నుంచి ఆత్మకూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి  నుంచి   బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ  జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం నుంచి ర్యాలీ జరిగింది.  మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురంలో మోటార్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రిలోని అన్ ఎయిడెడ్ కళాశాలల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా గోకవరం బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థి గర్జన నిర్వహించారు.
 
 గడపగడపకూ సమైక్యశంఖారావం
 
 పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరులో ఆళ్ల నాని ఆధ్వర్యంలో గడపగడపకూ సమైక్య శంఖారావం పేరిట పాదయాత్ర నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో  పార్టీ నరసాపురం పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ సెగ్మెంట్ సమన్వయకర్త తోటగోపి,   భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, ఉండిలోపార్టీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు, చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, నరసాపురంలో పార్టీ సీఈసీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగారుు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్   వెంకటరావు నేతృత్వంలో ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు వందలాది బైక్‌లపై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జిం చారు.  విజయనగరంలో విజయ్ ఆధ్వర్యంలో,  బొబ్బిలిలో ఆర్వీఎస్‌కేకే రంగారావు ఆధ్వర్యంలో  25 కిలోమీటర్ల వరకూ ర్యాలీ నిర్వహించారు.  
Share this article :

0 comments: