కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు?

కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు?

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014

కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు?
  • టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్న
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనో లేదా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శలు చేసే ముందు తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. ‘‘తమ పార్టీలో ఉంటే వైఎస్ జగన్ సీఎం లేదా కేంద్ర మంత్రి అయ్యేవారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ చెప్పలేదా? ఆయన మాటల్ని బట్టే జగన్ కాంగ్రెస్‌ను ఎదిరించారన్న సంగతి అర్థం కావడం లేదా? కాంగ్రెస్‌కు సహకరించి ఉంటే 18 నెలల పాటు జైల్లో ఉండాల్సిన అవసరం జగన్‌కు ఏముంది? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నా టీడీపీకి అర్థం కావడం లేదా?’’ అని ప్రశ్నించారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహచర శాసన సభ్యులు కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాటసాని రామిరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలతో కలిసి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. విభజన బిల్లు సమయంలో ఇరువైపులా ఎమ్మెల్యేలతో డ్రామాలు ఆడిస్తున్న చంద్రబాబు తన వైఖరిని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో తమ అధినేత జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. 
Share this article :

0 comments: