ఐదు లేదా ఆరు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు లేదా ఆరు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు

ఐదు లేదా ఆరు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు

Written By news on Monday, January 13, 2014 | 1/13/2014

ఐదు లేదా ఆరు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు
ఢిల్లీ:లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ ద్వితీయ పక్షం, మే మొదటి వారాల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఐదు లేదా ఆరు విడతల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తోంది. మార్చి నెల నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినున్నట్లు కేంద్ర ఎన్నికల వర్గాల కమీషన్ తెలిపింది. ఆ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. దానికోసం ఎన్నికల షెడ్యూల్‌ను ఫిబ్రవరి నెలాఖర్లో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేస్తామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల లోపలే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదింపచేయాలని ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
 
ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 1తో ముగియనుంది. అందువల్ల మే 31 కల్లా కొత్త సభ కొలువుతీరాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను ఐదు విడతలుగా నిర్వహించాలా లేక మరో విడత పెంచాలా అనే అంశంపై ఈసీ కసరత్తు చేస్తోంది.
Share this article :

0 comments: