ఓట్లు, సీట్లకోసం ప్రజాస్వామ్యం ఖూనీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్లు, సీట్లకోసం ప్రజాస్వామ్యం ఖూనీ

ఓట్లు, సీట్లకోసం ప్రజాస్వామ్యం ఖూనీ

Written By news on Sunday, February 23, 2014 | 2/23/2014

ఓట్లు, సీట్లకోసమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేశారని వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉదయం ఆయన తన నివాసగృహంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాదు లేని రాష్ట్రాన్ని ఊహించుకోలేకపోతున్నామన్నారు. చిన్నతనంనుంచే ప్రతి ఒక్కరికీ హైదరాబాదుతో విడదీయలేని బంధం ఉందనీ, అటువంటిది హైదరాబాదులాంటి రాజధాని నిర్మించుకోవాలంటే లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందన్నారు. చివరకు మీడియా ప్రసారాలను కూడా ఆపివేసి కేవలం 23 నిముషాలలో రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్లు ప్రకటించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. మరో పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిసి కూడా హడావుడిగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమన్నారు.
 
కేవలం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు ప్రాతిపదికనే విభజన చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసేలా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా తోడ్పడడం సీమాంధ్ర ప్రజలు జీవితంలో మరిచిపోలేరన్నారు. తాంబూలాలిచ్చేశాం...తన్నుకు చావండి అన్నట్లుగా కనీసం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఎంత మొత్తం కేటాయించనున్నారు.. ఎలా కేటాయిస్తారు.. ఎలాంటి ప్రకటన లేకుండా విభజించడం నిజంగా దుర్మార్గమైన చర్య అన్నారు.
 
 సోనియాగాంధీని రాష్ట్ర ప్రజలు ఎంతగా ఆదరించారో.. అంతగా ఆమె సీమాంధ్రుల గుండెలపై తన్నారని,  రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాలన్నీ గుర్తుంచుకుని తమకోసం నిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేవలం సీమాంధ్రలో ఎంఎల్‌ఏ సీట్లతోపాటు అన్ని ఎంపీ సీట్లు సాధించుకునేందుకు దృష్టిసారించారన్నారు. పాతిక ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించుకునే అవకాశం ఉంటుందని భావించారన్నారు.  ప్రజలు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. మరో వైపు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయగానే కేవలం రెండు నెలలు ఉండే పదవికోసం కాంగ్రెస్ పార్టీలోని నాయకులు పోట్లాడుకోవడం చూస్తుంటే వారికి అధికార దాహం ఎంత ఉందో స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు తెలుగుదేశంపార్టీ నాయకులకు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ ప్రకటనలు చేయాలని పాఠాలు బోధిస్తున్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
 
Share this article :

0 comments: