6న నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ‘జనభేరి’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 6న నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ‘జనభేరి’

6న నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ‘జనభేరి’

Written By news on Saturday, March 1, 2014 | 3/01/2014

జనభేరికి సన్నద్ధం
‘చలో నరసరావుపేట’ నినాదంతో మార్చి ఆరో తేదీన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జనభేరి’ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు.
 
శుక్రవారం రామిరెడ్డిపేటలోని తన కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారందరితో కలసి అయోధ్యరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే జనభేరి సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు.
 
ఆ సభలో ఆయన సమక్షంలో తనతో పాటు అనేక మంది నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోత్నునట్టు చెప్పారు. ఈ సభకు హాజరయ్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి, పార్టీ విధివిధానాలపై జగన్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరిన తరువాత నరసరావుపేట పార్లమెంటు స్థానానికి  పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. రాష్ట్రానికి దిశ, దశా నిర్ధేశించగల నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని ఆయన చెప్పారు.
 
 
కాంగ్రెస్,బీజేపీలు తీరని అన్యాయం చేశాయి : మర్రి రాజశేఖర్
 
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడి ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతాపార్టీ కూడా సీమాంధ్రులను మురిపించి అన్యాయానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో జగన్ ఒక్కరే మొదటి నుంచి సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ దేశంలోని జాతీయ నాయకులందరిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి వేదనలను పెడచెవిన పెట్టి విభజనకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారంలోకి రానున్నట్లు తెలియజేస్తున్నాయన్నారు. జగన్ సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని తమ ఇబ్బందులను తొలగించేది జగన్ ఒక్కరేనని భావిస్తున్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, సమన్యాయం అంటే ఏమిటో ఇప్పటికీ చంద్రబాబుకు తెలియదన్నారు.
 
కాంగ్రెస్‌వారిని చేర్చుకొని చ ంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని, రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించిన రాష్ట్ర మంత్రులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జనభేరి సభకు ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు స్వచ్ఛంధంగా తరలిరానున్నట్లు చెప్పారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మాచర్లలో ఓదార్పు యాత్రను కూడా జగన్ నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు, వినుకొండ నియోజవకర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నన్నపనేని సుధ ఇంకా ఆళ్ల పేరిరెడ్డి పాల్గొన్నారు
Share this article :

0 comments: