కొత్త పార్టీలు ఎన్నొచ్చినా జగన్‌కు ఎదురు లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్త పార్టీలు ఎన్నొచ్చినా జగన్‌కు ఎదురు లేదు

కొత్త పార్టీలు ఎన్నొచ్చినా జగన్‌కు ఎదురు లేదు

Written By news on Thursday, February 27, 2014 | 2/27/2014

  • చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రి కిరణ్  
  •  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చౌడేపల్లె, న్యూస్‌లైన్: కొత్త పార్టీలు ఎన్ని పుట్టుకొచ్చి నా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురులేదని, ఖచ్చితం గా ముఖ్యమంత్రి అవుతారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చౌడేపల్లె మండలంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం బుధవారం ఐదవ రోజుకు చేరింది. పర్యటనలో భాగంగా కొలింపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టినా అభ్యర్థులను గెలిపించుకునే సత్తా లేదన్నారు.

శాసనసభ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏనాడు వేల ఓట్ల మెజారిటీ సాధించలేదని గుర్తుచేశారు. అసమర్థత పాలన కొనసాగించి రాష్ట్రా న్ని రెండు ముక్కలుగా చేయడానికి కేంద్రంలోని పెద్దలకు సహకరించారని ఆరోపించారు. ఓట్ల కోసం ఏమార్చడానికి చూస్తున్న నాయకులకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చరిత్రలో అసమర్థ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిలిచిపోయారన్నారు. మూడు నెలల కాలంలో అనేక ఫైళ్లపై సంతకాలు చేసి అధికారం ముసుగులో వేల కోట్లు అక్ర మం గా కూడబెట్టారని ఆరోపించారు.

ఇప్పటికే కేంద్రం నుంచి తనిఖీ బృందం గవర్నర్ సమక్షంలో తనిఖీలు చేస్తున్నారని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయన్నారు. ఎన్ని కొత్త పార్టీలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, టీడీపీకి అప్పుడే గుబు లు పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం తధ్యమని, అన్ని ప్రాం తాలను సమానంగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ ద్వారకనాథరెడ్డి, నాయకులు ఎన్.రెడ్డెప్ప, ఇంకా రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, మునస్వామిరాజు, గాజుల రామ్మూర్తి, పద్మనాభరెడ్డి, లడ్డూరమణ, నాగభూషణరెడ్డి, ప్రవీణ్‌కుమార్, వెంకటరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: