సీఎం లక్ష్యం పూర్తైనట్లుంది అందుకే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం లక్ష్యం పూర్తైనట్లుంది అందుకే...

సీఎం లక్ష్యం పూర్తైనట్లుంది అందుకే...

Written By news on Wednesday, February 12, 2014 | 2/12/2014

సీఎం లక్ష్యం పూర్తైనట్లుంది అందుకే...భూమన కరుణాకర్ రెడ్డివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : సీఎం కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించి ఇప్పుడు రాజీనామా అంటూ కొత్త డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపై భూమన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న వెంటనే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన కిరణ్ ను ప్రశ్నించారు.
 
రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని తమ పార్టీ గతంలోనే పిలుపు నిచ్చిందని భూమన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అనాడు ఎందుకు స్పందించలేదంటూ సూటిగా కిరణ్ ను అడిగారు. సీఎం పదవిని అడ్డంపెట్టుకొని వందల కోట్లు సంపాదించాలన్న లక్ష్యం ఇప్పటికి పూర్తియిందా అంటూ కిరణ్ పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన లక్ష్యం పూర్తి అయింది అందుకే సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ కిరణ్ కొత్త పల్లవిని అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. 
Share this article :

0 comments: