రేపు సమైక్య బంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు సమైక్య బంద్

రేపు సమైక్య బంద్

Written By news on Wednesday, February 12, 2014 | 2/12/2014

వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నాడు సమైక్య బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య బంద్ ను విజయవంతం చేయాలని పార్టీ కోరింది. బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపించేలా పార్టీ శ్రేణులన్నీ ఈ బంద్ లో ముందుండాలని తన పార్టీ కేడర్ ను ఆదేశించింది.

దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే ప్రయత్నం, ఒక జాతిని చీల్చే ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదం మీద దండెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
Share this article :

0 comments: