ఫోటోలు ఫోర్జరీ చేసి దొరికిపోయిన లోకేశ్..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫోటోలు ఫోర్జరీ చేసి దొరికిపోయిన లోకేశ్..!

ఫోటోలు ఫోర్జరీ చేసి దొరికిపోయిన లోకేశ్..!

Written By news on Monday, February 10, 2014 | 2/10/2014

"బ్రింగ్ బాబు బ్యాక్..'' ఈ మధ్య తెలుగుదేశం అభిమానుల ఫేస్ బుక్ అకౌంట్స్ లో, బైకుల మీద కనిపిస్తున్న నినాదం! ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి నారా లోకేశ్ బాబు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబును తిరిగి తెచ్చుకొందామని లోకేశ్ బాబు అంటున్నాడు. ఇలా అనడమే గాక సోషల్ మీడియాలో ఈ నినాదాన్ని హోరెత్తిస్తున్నాడు లోకేశ్ బాబు.
 అయితే ఈ విషయంలో ఆయన చూపిన కొంచెంల అలసత్వం మొత్తానికే మోసం గా మారింది. తెలుగుదేశం అధికారంలోఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి విషయంలో దూసుకెళ్లిందని, ఆ త ర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పుణ్యాన మొత్తం అంధకారమేనని, అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయామని చెబుతున్నాడు లోకేశ్ బాబు.
ఇలా చెప్పడానికి వాడుకొన్న ఫోటోలతో లోకేశ్ తన ప్రియమైన ప్రత్యర్థులకు దొరికిపోయాడు. తెలుగుదేశంలో అధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు అంటూ లోకేశ్ ప్రచారంలోకి తెస్తున్న ఫోటోలు అన్నీ ఫేక్ అని.. అవి లోకేశ్ చేసిన ఫోర్జరీలుఅని అంటూ ఆయనపై సెటైర్లు వేస్తోంది జగన్  మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.
 అంతేకాదు లోకేశ్ తెలుగుదేశం అనుకూలమైనవిగా చూపుతున్న ఫోటోల్లో ఏది ఎక్కడ నుంచి తెచ్చింది కూడా వారు పరిశోధించి వివరిస్తున్నారు. వివిధ స్వచ్ఛంధ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలకు చెందిన బ్రౌచర్లపై ఉన్న ఫోటోలను తెచ్చి లోకేశ్ బాబు అవి తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు అని చెబుతున్నాడని రుజువులతో సహా చూపుతోంది.దీంతో లోకేశ్ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది.
ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాను తన ప్రచారంతో హోరెత్తించడానికి లోకేశ్ బాబు ఫోటోలను ఫోర్జరీ చేస్తున్నాడన్న విమర్శను భరించాల్సి వస్తోంది తెలుగుదేశం వాళ్లు. ఒకవేళ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త చూపించుంటే తమకు తిరుగులేకపోయేదని వారు చెబుతున్నారు!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/lokesh-booked-in-photos-forgery-50318.html#sthash.08LVO07a.dpuf
Share this article :

0 comments: