జూన్ 5, 6 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జూన్ 5, 6 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష

జూన్ 5, 6 తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష

Written By news on Sunday, May 10, 2015 | 5/10/2015

హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ నిర్ణయించిందని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 5, 6 తేదీల్లో గుంటూరు జిల్లాలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడతారని వెల్లడించారు.

గుంటూరు- విజయవాడ మధ్య వేదిక ఉంటుందని చెప్పారు. జిల్లా నేతలతో చర్చించిన తర్వాత వేదిక ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సర్కారుకు విజయోత్సవాలు జరుపుకునే నైతిక అర్హత లేదన్నారు. రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ ఏడాదిలో చంద్రబాబు పాలన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. చంద్రబాబు వైఫల్యాలను చిట్టాను ప్రజలకు వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: